ఇదేందయ్యా ఇది: ఊడిన అంగం.. చేతికి మొలిచింది…!  

limb, hand, pennis, england, docters - Telugu Docters, England, Hand, Limb, Pennis

నిజంగా ఇది ప్రపంచంలో అరుదైన కేసు.ఇలాంటి వైద్యం మీరు ఎప్పుడు కనివిని ఎరుగని ఉండరు.

 Limb Hand Pennisengland Docters

అసలు కారణం ఏమిటంటే 4 కొన్ని సంవత్సరాల క్రితం ఊడిపోయిన అంగం ఇప్పుడు అతడి చేతిలో పెరుగుతుందట.అవును మీరు విన్నది నిజమే… కాళ్ళ మధ్యలో ఉండాల్సిన అంగం అతని చేతిలో పెరగడం ఏంటి అని అనుకుంటున్నారా…? అయితే మీరు ఈ పూర్తి సంఘటన ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే సుమా…

ఇంగ్లాండ్ దేశంలోని నార్ఫోల్క్‌లో నివసిస్తున్న 45 ఏళ్ల మాల్కోలమ్ మెక్ డోనాల్డ్ వ్యక్తి కథ ఇది.ఆ వ్యక్తి దీర్ఘకాలికంగా పెరినియం ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నాడు.దీనితో అతడే అంగం పూర్తిగా నల్లగా మారిపోయి, ఆపై ఊడిపోయింది.

ఇదేందయ్యా ఇది: ఊడిన అంగం.. చేతికి మొలిచింది…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో 2014లో ఆయనకు వైద్యుల పర్యవేక్షణ నేపథ్యంలో అంగాన్ని పూర్తిగా తొలగించేశారు.ఇక అప్పటినుండి అతడు అంగం లేకుండానే జీవిస్తున్నాడు.

దీంతో తన భార్య ఆయనను వదిలేసి వెళ్లడమే కాకుండా వారి పిల్లలను కూడా తన వెంట తీసుకెళ్లి పోయింది.దీంతో అతడు పూర్తిగా కుమిలి పోయాడు.

అయితే అంతర్జాలంలో ఊడిన అంగాన్ని మళ్లీ పుట్టించవచ్చని తెలుసుకున్నాడు.దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకొని వైద్యులను సంప్రదించడంతో వైద్యులు వారి ప్రొఫెసర్ డేవిడ్ కు అతనిని పరిచయం చేశారు.

ఆయనను లండన్ యూనివర్సిటీలో కాలేజ్ హాస్పిటల్స్ లో ‘ పెనీస్ మాస్టర్ ‘ గా పిలవబడతారు.ఆయన సదరు వ్యక్తికి ధైర్యాన్ని తెలిపాడు.

ఎన్ హెచ్ ఎస్ ఫండింగ్ కింద అతడికి పురుష అంగాన్ని తిరిగి మళ్ళీ అతికించే చికిత్స ను చేపడతాం అని భరోసా ఇచ్చాడు.

అయితే ఇందుకు సంబంధించి ప్రొఫెసర్ చెప్పినా విధానం గురించి విన్న మాల్కోలమ్ మెక్ డోనాల్డ్ ముందుగా షాక్ కు గురయ్యాడు.

అయితే ప్రొఫెసర్ అంగాన్ని వేరే ఎక్కడి నుంచి కాకుండా అతడి చర్మం నుండి తయారు చేయవచ్చని తెలపగా, ఆపై శరీరంలోని ఎడమ చేతి భాగం నుండి చర్మాన్ని తీసుకుని దానిని గుండ్రంగా చుట్టి అందులోకి రక్తనాళాలు నరాలు ఏర్పాటు చేశారు.ఆ తర్వాత మూత్రమార్గాన్ని కూడా అందుకు జోడించారు.

ఆ తర్వాత దానిని అలాగే ఎడమ చేతిలోనే ఉంచారు.నిజంగా దాన్ని చూస్తే ఏదో ఒక భాగం బయటకు చొచ్చుకొని వచ్చినట్లు కనపడుతోంది.

ఇక ఇలా వచ్చిన భాగానికి సదరు వ్యక్తి ‘ జిమ్మి ‘ అని పేరు పెట్టుకున్నాడు.

ఇక ఈ విషయంపై అప్పట్లో డాక్టర్లు రెండు సంవత్సరాల తర్వాత దాన్ని నా అంగం స్థానంలో ఏర్పాటు చేస్తామని తెలిపారని, కానీ అప్పుడు అది కుదరలేదని తెలిపాడు.

దీనికి కారణం అతనికి ఆపరేషన్ జరిగే సమయంలో జ్వరం రావడంతో జరగలేదు.ఇక ఆ తర్వాత వైద్యుల కొరత తదితర కారణాలవల్ల మరో ఏడాది గడిచిపోయింది.2020 సంవత్సరంలో తన అంగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన వైద్యులు కరోనా వల్ల అది కూడా వాయిదా పడిపోయింది.దీంతో ఇప్పుడు ఆ వ్యక్తికి కొత్త అంగం ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.

తన అంగాన్ని 4 సంవత్సరాలుగా అలా చేతిలోనే ఉంచుకొని తిరుగుతున్నాడు మాల్కోలమ్ మెక్ డోనాల్డ్.బయటివారికి కనిపించకుండా కేవలం ఫుల్ హాండ్స్ దుస్తులు ధరిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.

ఇక చివరగా ఈ ఏడాది చివరికల్లా వైద్యులు తన చేతిలో తయారైన దాన్ని తీసి కాళ్ళ మధ్యలో అమర్చుతారని ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు.ఏదేమైనా ఈ సంఘటనతో సదరు వ్యక్తి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంగం చేతిలో ఉన్న వ్యక్తిగా రికార్డు కెక్కాడు.

#Hand #Limb #Docters #England #Pennis

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Limb Hand Pennisengland Docters Related Telugu News,Photos/Pics,Images..