ఇలా చెప్పీ చెప్పీ నాశ‌నం చేశారు సార్‌.. బీజేపీ సీనియ‌ర్ల గుస‌గుస‌..!

బీజేపీ సీనియ‌ర్లు.ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు.

 Like Telling This Spoiled Everything Bjp Seniors Murmuring, Bjp, Somu Veera Raju-TeluguStop.com

రాష్ట్ర పార్టీ చీఫ్ సోము వీర్రాజు చేస్తున్న కామెంట్లు, క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న సీనియ‌ర్లు.ఇదేం విడ్డూరం అంటూ బుగ్గ‌లు నొక్క‌కుంటున్నారు.

సీమలో జెండా నాటుతాం.సీమ అభివృద్దికి రు.20 వేల కోట్లు కేటాయిస్తాం.అధికారంలోకి రాగానే.

సీమ‌ను ప‌రుగులు పెట్టిస్తాం.రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కారుకు మేమే ప్రత్యామ్నాయం అంటూ సోము వీర్రాజు చెల‌రేగిపోతున్నారు.

త్వ‌ర‌లో ఉప ఎన్నిక జ‌రిగే తిరుప‌తి స‌హా వివిధ ప్రాంతాల్లో తిరిగి మీడియా స‌మావేశ‌లు పెడుతున్నారు.నిజానికి ఇదంతా ఎందుకు చేస్తున్నారో.ఎలా రు.20 వేల కోట్లు తీసుకువ‌స్తారో.అస‌లు పునాదులే లేని సీమ‌లో అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌కు బీజేపీని ఎలా ప్ర‌త్యామ్నాయంగా మారుస్తారో ? అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు.

అంతేకాదు.

పార్టీ నేత‌లు  ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా పార్టీని బ‌లోపేతం చేసే వ్యూహం లేకుండా.ఇలాంటి ప్ర‌క‌ట‌నలు ఎందుకు చేస్తున్నారో త‌మ‌కు అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

ఈ క్ర‌మంలోనే గ‌తంలో సీనియ‌ర్లు చేసిన ప్ర‌క‌ట‌నల‌ను కూడా వారు వ‌ల్లె వేస్తున్నారు.గ‌తంలో ఎంతో మంది నాయ‌కులు ఇలాంటి ఆర్భాట‌పు ప్ర‌క‌ట‌నలు చేశార‌ని.

దీనివ‌ల్ల ఒరిగింది ఏమీ క‌నిపించ‌లేద‌ని సీనియ‌ర్లు అంటున్నారు.రాష్ట్రంలో బీజేపీనే ప్ర‌త్యామ్నాయం అంటూ.

గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనూ అనేక మంది ఊద‌ర‌గొట్టిన విష‌యాన్ని సీనియ‌ర్లు గుర్తు చేస్తున్నారు.

Telugu Bjp Seniors, Jagan, Jagannath, Satire, Somu Veera Raju, Somu Veerraju, Ti

కానీ, వారంతా ఇప్పుడు అస‌లు ఎక్క‌డ ఉన్నారో.కూడా అడ్ర‌స్ లేర‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.పార్టీని ముందుకు తీసుకువెళ్లిన త‌ర్వాత చెప్పాల్సిన డైలాగులను ఇప్పుడే వ‌ల్లె వేయ‌డం వ‌ల్ల వ్య‌తిరేక సంకేతాలు వ‌స్తాయ‌ని హెచ్చరిస్తున్నారు.

పార్టీని ముందు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేలా.విస్తృతంగా ఉన్న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ఉపాధ్యక్షుల సేవ‌ల‌ను వినియోగించ‌డంపై సోము వీర్రాజు ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని.

సూచిస్తున్నారు.అదే స‌మ‌యంలో గ‌తంలో రాష్ట్ర చీఫ్‌గా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అనుస‌రించిన వ్యూహాల‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉందని ప‌లువురు సూచిస్తున్నారు.

గ‌తంలో క‌న్నా పార్టీ బ‌లోపేతం కోసం.స‌భ్య‌త్వాల న‌మోదును చేప‌ట్టార‌ని.అది మ‌ధ్య‌‌లోనే ఆగిపోయింద‌ని.దీనిని మ‌ళ్లీ తెర‌మీదికి తీసుకురావ‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు, ముఖ్యంగా యువ‌త‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చేందుకు ఉన్న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అంటున్నారు.

కానీ.ఈ వ్యూహాల‌ను ప‌క్క‌న పెట్టి.

గాలిలో దీపం పెట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారే.అని వ్యాఖ్యానిస్తున్నారు.

మ‌రి.సోము.

సీనియ‌ర్ల ఆవేద‌న‌, ఆందోళ‌న‌ను అర్ధం చేసుకుంటారా ? అనేది సందేహం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube