నయనతార లాగా తన పెళ్లి వీడియోను షోగా చేస్తున్న హన్సిక.. ఇవన్నీ అవసరమా అంటూ ట్రోల్స్?

ఈమధ్య హీరోయిన్ లు ప్రతి విషయంలో బాగా షో చేస్తున్నారు.ముఖ్యంగా తమ వ్యక్తిగత విషయాలలో మాత్రం అసలు షో చేయకుండా ఉండట్లేదు.

 Like Nayanthara, Hansika Is Making Her Wedding Video A Show ,nayantara, Hansika-TeluguStop.com

పైగా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో అందరికీ తామేంటో తెలిసేలా చేస్తున్నారు.అయితే తమ పెళ్లిళ్ల విషయాలలో కూడా షేర్ చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

ఇప్పటికే కొందరు హీరోయిన్లు తమ వెడ్డింగ్ ను బాగా స్టైల్ గా ప్లాన్ చేసి సందడి చేశారు.

తమ ఎంగేజ్మెంట్ నుంచి హనీమూన్ ట్రిప్స్ వరకు వీడియోలను తీస్తూ షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తున్నారు.

నయనతార కూడా తన పెళ్లి సమయంలో తన పెళ్లి వీడియోను ఏకంగా స్పెషల్ షోగా నెట్ఫ్లిక్స్ లో ప్రసారం చేసింది.మామూలుగా ఈ మధ్య పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ జంటలు బాగా ఫోటో షూట్ లు చేయించుకొని వీడియో మాదిరిగా వదులుతున్నారు.

కానీ హీరోయిన్లు మాత్రం ఏకంగా ఒక సీరిస్ నే చూపిస్తున్నారు.

పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భాన్ని వదలకుండా రికార్డు చేయించి ఓటీటీ లోని ప్రేక్షకులందరికీ చూపిస్తున్నారు.

అలా నయనతార నెట్ఫ్లిక్స్ లో తన పెళ్లి వీడియోను షేర్ చేసుకుంది.ఆ వీడియోకు ముందు ఒక చిన్న ప్రోమో కూడా వదిలింది.

ఇప్పుడు ఈమె బాటలో మరో హీరోయిన్ హన్సిక కూడా తన పెళ్లి వీడియోను ఓటీటీ లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హన్సిక గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ దేశముదురు సినిమాలో తన నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.గతంలో తన ప్రేమ విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఆ తర్వాత తన ఫ్రెండ్ మాజీ భర్తను ప్రేమించి గత ఏడాది కుటుంబ సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.తను తన ఫ్రెండ్ మాజీ భర్తను పెళ్లి చేసుకోవడంతో అందరూ తనపై విమర్శలు చేశారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా పెళ్లి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది.తన భర్తతో కలిసి హనీమూన్ టిప్స్ చేస్తూ సందడి చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అది ఏంటంటే తన పెళ్లి వీడియోను కూడా స్పెషల్ షో గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయటానికి సిద్ధంగా ఉంది.దానికి సంబంధించిన విషయాన్ని తెలుపుతూ వీడియో షేర్ చేసుకుంది.

ఇక ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వగా.ఇవన్నీ షో చేయడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మరి కొంతమంది నయనతారను ఫాలో అవుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube