ఫైన్ వేసినందుకు కారుపై క‌ట్టేసి లాక్కెళ్లిన ట్యాక్సీవాలా..

కరోనా మూడోవేవ్ ద‌ర్వాజ వద్ద నిలబడి ఉంది.అయిన‌ప్ప‌టికీ ప్రజలు మాస్క్ లు లేకుండా బయట విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు.

 Like A Taxi Driver Who Gets Stuck In A Car For Being Fined , Taxi Wala, Viral Vi-TeluguStop.com

మాస్క్ లు పెట్టుకొమ‌ని ప్రజలను కోరడానికి బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ బొంబాయిలోని వివిధ ప్రదేశాలలో ఫీల్డ్ మార్షల్స్‌ను నియమించింది.అలాంటి ఒక క్లీన్-అప్ మార్షల్స్ పని చాలా ఇబ్బందికరంగా మారింది.

మాస్క్ పెట్టని వారిని అడిగితే దాడులు చేస్తున్నారు.ఈ మార్షల్స్ పని చాలా ఇబ్బందిగా మారింది.

అయినా మార్షల్స్ పట్టువదల కుండా ఎక్కడ మాస్క్ పెట్టుకోకుండా ఎవ‌రూ కపించినా సరే వారిని విడిచిపెట్ట‌కుండా ప్రశ్నిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో ఓ మార్షల్ మాస్క్ పెట్టుకోవాల‌ని ఒక కారు డ్రైవర్ ను కోరాడు.

దీంతో ఆ డ్రైవర్ మార్షల్ ను తన కారు బోనెట్‌పై ఉరివేసి ర‌హ‌దారిపై చాలా దూరం లాక్కుని తీసుకెళ్లాడు.ఈ ఘటన సెప్టెంబర్ 2 న జరిగ‌గా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

వారం రోజుల‌ తర్వాత గ‌డిచిన‌ప్ప‌టికీ నిందితుడు పోలీసులకు చిక్కలేదు.బొంబాయిలోని శాంతాక్రజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇక్కడ ఒకత‌ను మాస్క్ లేకుండా కారు నడుపుతున్నాడు.అతడిని చూసిన‌, సురేష్ అనే మార్షల్ తన కారును ఆపాడు.మాస్క్ లేక‌పోవ‌డంతో చలాన్ కట్ చేసి ఇచ్చాడు.చలాన్ డ‌బ్బులు కట్టలాని ప్ర‌శ్నించాడు.

అయితే, ఆ డ్రైవర్ ఆగకుండా కారును ఆపడానికి ప్రయత్నిస్తున్న మార్షల్‌పై కారు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.మార్షల్ ను కారుతో గుద్ది.

బానేట్ మీద మార్షల్ పడిపోవడంతో అతనిని అలానే చాలా దూరం లాక్కొని వెళ్లాడు.కొంత దూరం తరువాత మార్షల్ కారు నుంచి జారిపప‌డ‌డంతో అతనికి కొద్దిగా గాయాలు అయ్యాయి.

అయినా కారులో ఉన్న డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళ్లాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube