‘‘అచ్చం మహారాజులాగే’’: ఒకే ఒక్క ప్రయాణికుడితో దుబాయ్‌కి ఎగిరిన ఎయిరిండియా ఫ్లైట్

ఒక పెద్ద విమానంలో ఎవరూ లేకుండా ఒక్కరే ప్రయాణం చేయాలంటే అది రాజులు, ధనవంతులకు మాత్రమే సాధ్యం.ఇలాంటి అరుదైన అవకాశం వరించింది ఓ భారత సంతతి వ్యాపారవేత్తకి.

 like A Maharaja: Indian Businessman Only Passenger On Flight To Dubai, United Ar-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.పదేళ్ల యూఏఈ గోల్డెన్ వీసా వున్న ఎస్పీ సింగ్ ఒబెరాయ్ బుధవారం ఎయిరిండియా విమానంలో పంజాబ్‌లోని అమృతసర్ నుంచి దుబాయ్‌కి ప్రయాణించారు.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ విమానంలో సిబ్బంది, ఎస్పీ సింగ్ తప్ప మరో ప్రయాణికుడు లేడు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా విధానం ప్రకారం.10 సంవత్సరాల పాటు సదరు వ్యక్తి ఇక్కడ వుండేందుకు అవకాశం వుంటుంది.కొంతమంది నిపుణులు, ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులకు మాత్రమే ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేస్తారు.

ఇక ఒబెరాయ్ విషయానికి వస్తే.ఆయన ఆసియా గాట్కా ఫౌండేషన్ అధ్యక్షుడిగా, అపెక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడిగా, సర్బత్ డా భాలా ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

భారత్ నుంచి దుబాయ్‌ చేరుకున్న తర్వాత ఎస్పీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.ఈ ప్రయాణంలో తాను రాజాలాగా ఫీలయ్యానని చెప్పారు.

తొలుత ఎస్పీ సింగ్‌ను విమానం ఎక్కేందుకు అధికారులు నిరాకరించారు.అయితే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జోక్యంతో ఆయన సమస్య పరిష్కారమైంది.యూఏఈ అనుమతి పొందిన టీకా వేసుకోవడంతో పాటు సంబంధిత పత్రాలు వుండటంతో ప్రయాణానికి ఇబ్బందులు తొలగిపోయానని ఒబెరాయ్ తెలిపారు.తన జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోయే ప్రయాణానికి తనకు అందించిన యూఏఈ, భారత ప్రభుత్వాలకు ఎస్పీ సింగ్ కృతజ్ఞతలు చెప్పారు.

కాగా, భారత్‌లోని భయానక పరిస్ధితుల నేపథ్యంలో అక్కడి వేరియెంట్ తమ దేశంలో ప్రవేశించకుండా పలు దేశాలు విమాన ప్రయాణాలు నిషేధించాయి.ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన నిషేధం ఎన్ని విమర్శలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్కనక్కర్లేదు.

హద్దు మీరి స్వదేశంలో అడుగు పెడితే జైలు శిక్షతో పాటు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఆ నిషేధం ముగిసిందనుకోండి.ఈ సంగతి పక్కనబెడితే.గ‌ల్ఫ్ దేశాలు సైతం భారత్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

దీంతో వివిధ ప‌నులపై గ‌ల్ఫ్ నుంచి భారత్‌కు వచ్చినవారు.గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు రావాల్సిన వారు చిక్కుకుపోయారు.

ఇక‌ త‌ప్ప‌నిప‌రిస్థితుల్లో వెళ్లాల్సిన వారు ప్రైవేట్ విమానాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.ఇది భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో సంపన్నులు తప్ప.

సామాన్యులు అటువైపు తొంగి చూడటం లేదు.మొన్నామధ్య తల్లిని చూడటానికి యూఏఈ నుంచి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భార్యాబిడ్డలతో భారత్‌లో చిక్కుకుపోయారు.దీంతో ఆయన తిరిగి దుబాయ్ వెళ్లేందుకు గాను అక్షరాల రూ.55 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

Telugu Goldenvisa, Gulf, Oberoi, Sp Singh, Arabemirates-Telugu NRI

మరోవైపు రెండు నెలల తర్వాత యూఏఈకి ఎయిరిండియా విమానాలను పునరుద్దరించింది.ఏప్రిల్ 24 నుంచి ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన సర్వీసులను తిరిగి నిన్నటి నుంచి పున: ప్రారంభించారు.కాగా, ఇప్పటికే దుబాయ్ నుంచి భారత్‌కు విమానాలు నడుస్తున్నాయి.అయితే భారత్ నుంచి వెళ్లే విమానాలపై మాత్రం నిషేధం ఉంది.యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలు, ఎంపిక చేసిన గోల్డెన్ వీసా హోల్డర్లను మాత్రమే ఇండియా నుంచి యూఏఈకి తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube