జై భీమ్ కోసం ఎలుక మాంసం తిన్నాను.. సినతల్లి కామెంట్స్ వైరల్?

లిజోమోల్‌ జోస్‌ అంటే వెంటనే ఈమెను గుర్తించకుండా ఎవరు అనే ప్రశ్న ఎదురవుతుంది.కానీ జై భీమ్ చిత్రంలోని సిన తల్లి అంటే మాత్రం అందరికీ టక్కున ఈమె గుర్తొస్తారు అంతగా ఆ పాత్రలో లీనమై నటించింది అనేకన్నా జీవించింది అని చెప్పడం కరెక్టుగా సరిపోతుంది.

 Lijomol Jose Training In Catching Rats And Tasted Rat Meat For Jai Bhim Movie De-TeluguStop.com

టీ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన జై భీమ్ చిత్రంలో సినతల్లి ఈ పాత్రలో నటించి అందరి చేత కంటతడి పెట్టించిన లిజోమోల్‌ జోస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో తెలుగు తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అలాగే తెలుగులో డబ్‌ అయిన ఒరేయ్‌ బామ్మర్ది సినిమాతో మరింత గుర్తింపు సంపాదించుకుంది.ఈ సినిమా చూసిన తర్వాత జ్ఞానవేల్ జై భీమ్ చిత్రం కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

ఇందులో ఒక గిరిజన మహిళగా నటించిన ఈమె సినిమాలో సహజం గా కనిపించడం కోసం ఎంతో శ్రమించానని తెలిపారు.ఈ క్రమంలోనే ప్రతిరోజు గిరిజనులు నివసించే గుడిసెలకు వెళ్లి వారి ఎలాంటి పనులు చేస్తున్నారు వారి జీవన విధానం ఏ విధంగా ఉందనే విషయాన్ని గమనించి వారి చేస్తున్న పనులను నేర్చుకొనేదాన్ని అని తెలిపారు.

Telugu Chinna Talli, Gnanavel, Surya, Jai Bhim, Kollywood, Lijomol Jose, Lijomol

అయితే వాళ్లు చెప్పులు వేసుకోకుండా ఉండడం రాత్రి పగలు అనే తేడా లేకుండా బయటకు వెళ్లడం అన్ని గమనించాలని అయితే వాళ్లు వేటకు వెళ్లి అడవి ఎలుకలను తెచ్చుకుని కూర వండుకొని తింటారు.ఈ పాత్రలో నటించడం కోసం నేను కూడా ఎలకలను తినడం నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.ఎలకల కూర అచ్చం చికెన్ మాదిరే ఉంటుందని హీరోయిన్ వెల్లడించారు.అయితే ఈ విషయం తన కుటుంబంలో తెలిసినప్పుడు వాళ్లు ఎంతో ఆశ్చర్యంగా ఎలకలు తిన్నావా?అని ప్రశ్నించారని అందులో తప్పేముంది వారి తింటున్నప్పుడు మనం తినడంలో ఏమాత్రం తప్పులేదని తన కుటుంబ సభ్యులకు ఈమె సర్ది చెప్పినట్లు తెలిపారు.ఇలా ఈమె ఎలుకలు తిన్న విషయాన్ని తెలియజేయడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube