వైట్ హౌస్ లో లైట్లు ఆర్పేశారు…ఇది దేనికి సంకేతం..??  

Lights Went Out White House Trump - Telugu Bunker, Donald Trump, George Floyd Protesters, White House, White House Lights Went Out

ప్రస్తుతం అమెరికాలో కరోనా టెన్షన్ కంటే కూడా నల్లజాతీయుడి హత్య ఉదంతం పై జరుగుతున్న అల్లర్ల టెన్షన్ ఎక్కువై పోతోంది.ఊహించని, కావాలని చేసిన ఈ సంఘటనపై అమెరికాలో భారీ ఎత్తున నిరసనలు రేగుతున్నాయి.

 Lights Went Out White House Trump

ఒక్క అమెరికాలో మాత్రమే కాదు.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో ప్రజలు , ఉద్యమ కారులు జార్జ్ మరణానికి సమాధానం చెప్పాలని నిరసనలు తెలిపుతున్నారు.

అమెరికాలో నిరసన కారులని నివరించడం అధికారులని ఏ మాత్రం సాధ్యం కావడంలేదు.

వైట్ హౌస్ లో లైట్లు ఆర్పేశారు…ఇది దేనికి సంకేతం..-Telugu NRI-Telugu Tollywood Photo Image

వారి కోపం ఏ స్థాయిలో ఉందంటే వైట్ హౌస్ మీదకే దాడి చేసేందుకు వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఈ క్రమంలోనే వైట్ హౌస్ లోపలి రాళ్ళు.సీసాలు విసురుతున్నారు.వైట్ సమీపంలో ఉన్న వాహనాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్ కి నిప్పు పెడుతున్నారు.పోలీసులు బాష్ప వాయువుని ప్రయోగించినా సరే ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు నిరసన కారులు.

ఈ పరిణామాల కారణంగానే ట్రంప్ వైట్ హౌసులో ఉన్న సీక్రెట్ బంకర్ లో తల దాచుకున్నారు.ఇదిలాఉంటే వైట్ హౌస్ లో ఒక్క సారిగా లైట్లు అన్నీ ఆర్పేయడం అందరిని ఆశ్చర్య పరిచింది.

సహజంగా వైట్ హౌస్ లో లైట్లు ఏ సందర్భంలో ఆర్పేస్తారంటే అధ్యక్షుడు చనిపోయిన సమయంలో మాత్రమే లైట్లు తీసేస్తారు.మరి ఇప్పుడు ఎందుకు ఆ పనిచేసినట్టంటే.నిరసన కారులకి వైట్ హౌస్ టార్గెట్ అవ్వడంతో వారిని కన్ఫ్యూజన్ లో పడేసేందుకు ఈ ప్రయత్నం చేశారని తెలుస్తోంది.వైట్ హౌస్ ఉత్తర భాగంలో లైట్లు మొత్తం తొలగించారు.

ఎలాగో అధికారుల వద్ద నైట్ విజన్ పరికరాలు ఉండటంతో సులభంగా నిరసన కారులని గుర్తించ వచ్చు కానీ వారికి చీకట్లో ఉన్న వైట్ హౌస్ ని గుర్తించడం అసంభవం అందుకే లైట్లు తొలగించి వైట్ హౌస్ కి గట్టి బద్రతని ఇచ్చే ప్రయత్నం చేశామని అంటున్నాయి వైట్ హౌస్ వర్గాలు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test