అఫీషియల్: లైగర్ పంచ్ ఎప్పుడో చెప్పేసిన రౌడీ!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ చిత్రం కూడా ఒకటి.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Liger Movie Release Date Fixed-TeluguStop.com

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.కాగా ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ పక్కా ప్రణాళికతో దూసుకుపోతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా, షూటింగ్ ఇంకా పూర్తికాలేదు.దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

 Liger Movie Release Date Fixed-అఫీషియల్: లైగర్ పంచ్ ఎప్పుడో చెప్పేసిన రౌడీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాజాగా ఈ సందేహానికి చిత్ర యూనిట్ ఫుల్‌స్టాప్ పెట్టేశారు.లైగర్ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయమని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూరీ డైరెక్ట్ చేస్తుండగా, పూరీ కనెక్ట్స్‌పై ఛార్మీతో కలిసి ఆయన స్వయంగా నిర్మిస్తున్నాడు.

కాగా బాలీవుడ్‌లో ఈ సినిమాను కరణ్ జోహర్ రిలీజ్ చేస్తుండటంతో బాలీవుడ్ జనాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఇతర చిత్రాలతో పోటీ లేకుండా సోలోగా దిగుతుండటంతో లైగర్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

మరి లైగర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 9 వరకు ఆగాల్సిందే.

#Liger #Puri Jagannadh #Ananya Pandey #Release Date

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు