లైగర్ మూవీకి ఓటీటీ నుంచి ఊహించని ఆఫర్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 Liger Gets Rs 200 Cr Direct Ott Offer Puri Jagannadh-TeluguStop.com

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.రమ్యకృష్ణ, సునీల్ శెట్టి, సురేష్ గోపి లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మెజారిటీ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.ఇక లాక్ డౌన్ నుంచి ఉపశమనం లభించడంతో మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నారు.

 Liger Gets Rs 200 Cr Direct Ott Offer Puri Jagannadh-లైగర్ మూవీకి ఓటీటీ నుంచి ఊహించని ఆఫర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.ఈ మూవీని ఒటీటీలో రిలీజ్ చేయడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నారని సమాచారం.

దీనికి కారణం కూడా ఉంది.ప్రముఖ ఒటీటీ చానల్స్ ఈ మూవీ డిజిటల్ రిలీజ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి.

విజయ్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని లైగర్ సినిమాకి భారీగానే ఆఫర్ చేస్తున్నట్లు టాక్.ఇక ఓ ఒటీటీ ఛానల్ అయితే ఏకంగా 200 కోట్లు లైగర్ డిజిటల్ రిలీజ్ కోసం ఆఫర్ చేసినట్లు వినికిడి.

ఇక ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ డీల్ రావడంతో పూరి జగన్నాథ్ కూడా మూవీని డిజిటల్ రిలీజ్ చేయడానికి మొగ్గు చూపించారని టాక్.త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ మార్కెట్ ని చూసుకున్న పూరికి వచ్చిన ఆఫర్ చాలా ఎక్కువ మొత్తం అని చెప్పాలి.థియేటర్ లో లైగర్ రిలీజ్ చేసిన సూపర్ హిట్ యింతే మాత్రం ఓ వంద కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది.

గట్టిగా ప్రయత్నం చేసిన పాన్ ఇండియా మూవీ కాబట్టి 150 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.అయితే ఒటీటీ ఛానల్ నుంచి 200 కోట్లు ఆఫర్ రావడం తోనే ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంప్ట్ అయ్యి ఒటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది.

#Ananya Panday #LigerGets #Charmi #Puri Jagannadh #Karan Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు