40 ఏళ్ళు దాటాక తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు ఇవి  

  • మనిషి జీవితం 40 ఏళ్ళ వయసుకి ముందు ఒకలాగా, ఆ వయసు దాటిన తరువాత మరొకలాగ ఉంటుంది. బాధ్యతలు పెరగటం వలన, శరీర మార్పుల వలన, స్ట్రెస్ ఎక్కువై మానసికంగా, రోగాలు దగ్గరై శారీరకంగా సతమతమవుతుంటారు. అందుకే ఆ వయసుకి రాగానే మన లైఫ్ స్టయిల్ లో మార్పులు చేయాలి.

  • * మూడుపదుల వయసు దాటాక మెల్లిగా కండరాల్లో మాస్ తగ్గుతూ ఉంటుంది. రక్తం సరఫరా కూడా స్లో అయిపోతుంటుంది. కాబట్టి, వ్యాయామం కంపల్సరీ. లేదంటే, 50 నుంచి జీవితం కష్టంగా తయారవుతుంది.

  • * ఆ వయసులో మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఫైబర్ కంటెంట్ ఒంట్లో ఎక్కువ పడాలి. రైస్ తగ్గించి రొట్టె తినాలి. ఫైబర్ ఉండే ఫలాలు ఎక్కువ తీసుకోవాలి.

  • * ఎముకలు అరిగిపోతాయి, బలహీనమవుతాయి. కాబట్టి కాల్షియం లెవెల్స్ తీసుకోవడం పెంచండి.

  • * కంటిచూపు జాగ్రత్త. విటమిన్ సి ఉండే పదార్థాలు తినాలి. మొబైల్స్, ల్యాప్ టాప్ వాడకం తగ్గించాలి.

  • * వయసు పెరిగినాకొద్ది శరీరంలో సోడియం నీళ్ళ శాతం బ్యాలెన్స్‌ తప్పుతుంది. కాబట్టి ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. అంటే నీళ్ళు బాగా తాగాలి.

  • * వయసు, బరువు, ఎత్తు, బాడి మాస్ ఇండెక్స్ అన్ని లెక్కలు వేసుకోండి. ఫ్యాట్ ఉంటే కరిగించండి. బలహీనంగా ఉంటే బరువు పెంచండి.

  • * విటమిన్ ఏ, సీ, యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ వయసులో లేని ఆరోగ్య సమస్యలు శరీరం మీద దాడికి వస్తాయి. కాబట్టి రోగనిరోధకశక్తి పెంచుకోవాలి.

  • * మరో ముఖ్యమైన విషయం, మెంటల్ హెల్త్ ముఖ్యం. నవ్వండి, ప్రశాంతంగా ఉండండి. మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది.