లైఫ్ అనుభవించు రాజా  చిత్రాన్ని ఎన్టీఆర్ కి అంకితమిచ్చిన దర్శకుడు...   

Life Anubhavinchu Raja Movie News-tollywood

టాలీవుడ్ లో ప్రస్తుతం నూతన దర్శకుడు సురేష్ తిరువూరు “లైఫ్ అనుభవించు రాజా” అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు.ఈ చిత్రంలో హీరోగా నూతన రవితేజ నటిస్తున్నాడు.రవితేజ సరసన శ్రావణ్ నిక్కీ, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సురేష్ తిరువూర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

Life Anubhavinchu Raja Movie News-Tollywood

ఇందులో భాగంగా చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఈ ఈ చిత్ర టైటిల్ విషయం గురించి మాట్లాడుతూ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి మనుషులంతా ఒక్కటే అనే పాట ఆధారంగా ఈ చిత్ర టైటిల్ ని ఖరారు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఈ చిత్రాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఇస్తున్నట్లు తెలిపారు.అలాగే ఈ చిత్రం ఓ యువకుడు తన జీవితంలో పడినటువంటి కష్టాలను, ఒడిదొడుకులను ఎదుర్కొని కోటీశ్వరుడుగా ఎదిగి తన జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనే అంశంపై ఈ చిత్రం తెరకెక్కించామని ఖచ్చితంగా ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ప్రతి ఒక్కరు సినిమా థియేటర్లకు వెళ్లి చూడాలని కోరారు.

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా ఈ నెల 14వ తారీకు న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే  ఈ నూతన దర్శకుడిని తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

తాజా వార్తలు

Life Anubhavinchu Raja Movie News-tollywood Related....