వెంకీ, వరుణ్ లతో కలిసి స్వాతిముత్యం స్టెప్పులతో స్టేజ్ ను వేడెక్కించిన పూజా..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎఫ్ 3.అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైమింగ్ తో, డైలాగ్ లతో ఎఫ్ 2 సినిమాను చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

 Life Ante Itta Vundaala Video Song From F3 Movie, Life Ante Itta Vundaala Video-TeluguStop.com

ఇక ప్రెసెంట్ అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ గా ‘ఎఫ్ 3‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ పాటలు అన్ని కూడా అలరించాయి.ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ రోల్ లో నటిస్తుంది అనే విషయం విదితమే.ఈమె చేసిన స్పెషల్ సాంగ్ కు సంబంధించిన వీడియో సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేసారు.

లైఫ్ అంటే ఇట్టా ఉండాలా‘ అనే ఫుల్ వీడియో సాంగ్ వదలడంతో ఈ సాంగ్ అందరిని అలరిస్తుంది.ఈ పాట ఫుల్ పార్టీ థీమ్ లో కలర్ ఫుల్ గా సాగింది.ఈ సాంగ్ లో వెంకటేష్, వరుణ్ తేజ్, పూజా హెగ్డే కలిసి కమల్ హాసన్ స్వాతిముత్యం స్టైల్ లో డ్యాన్స్ వేయడం ఆకట్టుకుంది.

ఈ పాటకు ఇది స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.ఎప్పటి లాగానే బుట్టబొమ్మ తన గ్లామర్ తో మైమరిపించేలా చేసింది.

Telugu Anil Ravipudi, Mehreen, Pooja Hegde, Tamannah, Varun Tej, Venkatesh-Movie

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగి పోయాయి.మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమా కూడా నవ్వించడం ఖాయంగా కనిపిస్తుంది.మరి సమ్మర్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి టీమ్ అంతా సిద్ధం అవుతుంది.చూడాలి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube