గన్స్ అమ్మేటప్పుడు.. ఎంక్వైరీ తప్పనిసరి : టెక్సాస్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్

రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న తుపాకుల అమ్మకాలపై టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డన్ పాట్రిక్ దృష్టిసారించారు.దీనిలో భాగంగా అమెరికా పౌరులు కానీ వారికి తుపాకులు విక్రయించేముందు అతని పూర్వాపరాలు తెలుసుకోవాలని ఆదేశించారు.

 Lieutenant Governor Dan Patrick Ready To Work On Restricting Gunsales-TeluguStop.com

అపరిచితుడికి.అపరిచితుడికి మధ్య ఉన్న అనుబంధాన్ని మనం అడ్డుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Telugu Dan Patrick, Gun, Telugu Nri Ups, Texaslieutenant-Telugu NRI

  కొందరు అపరిచితులు ఆయుధాలు కొనుగోలు చేసి వాటిని ప్రభుత్వం నిషేధించిన వ్యక్తులకు లేదా సంస్థలకు చేరవేస్తున్నారని.కాబట్టి గన్స్ అమ్మే సమయంలో విచక్షణతో ఆలోచించాలని తుపాకులు విక్రయించే యజమానులకు పాట్రిక్ సూచించారు.తుపాకులను ముక్కు, ముఖం తెలియని వ్యక్తికి ఎలా అమ్ముతారంటూ కొందరు తనను ప్రశ్నించారని.కొన్న వ్యక్తి భారీగా ప్రజలను చంపే వ్యక్తికావొచ్చు.లేదంటే ఒక ఉన్మాది అయి ఉండొచ్చని.అతను ఆ గన్‌తో ఖచ్చితంగా నేరమే చేస్తాడని జనం తన దృష్టికి తీసుకొచ్చారని పాట్రిక్ తెలిపారు.

Telugu Dan Patrick, Gun, Telugu Nri Ups, Texaslieutenant-Telugu NRI

  ఈ నేపథ్యంలో తుపాకుల విక్రేతలు కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలని.ప్రజలు కూడా స్నేహితుల్ని చివరికి కుటుంబసభ్యుల్ని సైతం అనుమానించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.అలాగే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రికార్డుల్లో తుపాకులను నమోదు చేయించాలని కోరారు.

కాగా కొద్దిరోజుల క్రితం టెక్సాస్‌లో ఒడెస్సాలో ఓ వ్యక్తి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కారును చోరీ చేసి.

దానిని నడుపుతూనే జనంపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.21 మంది తీవ్రంగా గాయపడటంతో అమెరికా ఉలిక్కిపడింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube