లై మూవీ రివ్యూ  

Lie Movie Review-

చిత్రం : లై

లై మూవీ రివ్యూ -

సంగీతం : మణిశర్మ

విడుదల తేది : ఆగష్టు 11, 2017
కథలోకి వెళితే :పద్మనాభం (అర్జున్) ఒక బడాబాబు. చాలా తెలివిమంతుడు కూడా. కాని ఇతనికి ఓ వెరైటి అబ్సెషన్ ఉంటుంది. సినిమాలోని డైలాగ్ లాగా, బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటివరకు సృష్టించలేదు.

ఈ బలవంతుడికి కూడా ఓ బలహీనత ఉంది.మరోవైపు సత్యం (నితిన్) పచ్చి అబద్ధాలకోరు. నా పేరు దయ, నాకు లేనిదే అది అన్నట్లు సత్యం అన్ని అబద్ధాలే చెబుతాడు.

ఇతడికి అబద్ధాలకి పడిపోయే అమ్మాయి చైత్ర (మేఘా ఆకాష్). వీరి ప్రేమకథ సాఫీగా సాగుతున్నప్పుడు నితిన్ చేతికి ఓ సూట్ కేసు దొరుకుతుంది. ఆ సూట్ కేసు కోసం ఏ.

సత్యం జీవితంలోకి ఎంటర్ అవుతాడు విలన్. అసలు ఆ సూట్ కేసులో ఏముంది ? పద్మనాభంకి దానితో ఉన్న అవసరం ఏమిటి ? ఆద్యంతం ట్విస్టులతో సాగే ఆ కథేంటో తెర మీద చూడండి.నటీనటుల నటన :

నితిన్ ఫుల్ బియర్డ్ లుక్ లో రఫ్ అండ్ స్టైలిష్ గా కనిపించాడు. చాలా రెఫ్రెషింగ్ లుక్ ఇది.

అలాగే నటనపరంగా కూడా ఆకట్టుకుంటాడు. నితిన్ కి ఉన్న మైనస్ పాయింట్స్ లో ఒకటి డైలాగ్ డెలివరి. కాని సినిమాలో చాలా ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తుంది.

నితిన్ కి బాగా ఉపయోగపడే సినిమా. మేఘా ఆకాష్ అందంగా ఉంది. డీసెంట్ గా నటించింది.

కాని ఎదో మూలా, అందరు హీరోయిన్ల మాదిరి అనిపించదు. కాబట్టి మాస్ ఆడియెన్స్ నుంచి ఏమైనా కంప్లయింట్స్ ఉంటే ఉండొచ్చు.అర్జున్ విలనిజం సూపర్.

కొన్ని సీన్స్ లో నితిన్ ని కూడా డామినేట్ చేసేసారు యాక్షన్ కింగ్. అర్జున్ పాత్ర ఖచ్చితంగా సినిమాకి మేజర్ హైలెట్. ఆ పాత్రస్వభావం లేకపోతే ఈ కథ పుట్టేదే కాదు.

చాలాకాలం తరువాత శ్రీరామ్ కనిపించి డీసెంట్ పాత్ర చేసాడు. ఎప్పటిలాగే తెలుగు సినిమాల్లో రవికిషన్ మెప్పించలేకపోతాడు. టెక్నికల్ టీమ్ :

మణిశర్మ ఈజ్ బ్యాక్. పాటలన్నీ ఇప్పటికే హిట్.

భోమ్భాట్ అనే పాట చూసినా మోగుతోంది. తెర మీద పాటలు చూడ్డానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసారు.

ఈమధ్య కాలంలో డి బెస్ట్ రీ-రికార్డింగ్ ఈ సినిమాలో చూడొచ్చు. సినిమాటోగ్రాఫీ గ్రాండ్ గా ఉంది. ఓర్పు, శర్మ, అలాగే ఖర్చుతో కూడుకున్న ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి.

చాలా పెద్ద స్థాయి కెమెరా వర్క్. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వంద శాతం అవుట్ పుట్ రాలేదు. సినిమాని ఇంకా రేసిగా మార్చే అవకాశాలు చాలా ఉన్నా, కమర్షియల్ వాల్యూస్ కోసం బేఖాతరు చేసారు.

ఇది 14 రీల్స్ నిర్మాణంలో వచ్చిన సినిమా. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కొత్తగా మాట్లాడాల్సిన పని లేదు.విశ్లేషణ :

విలన్ పాత్ర బలంగా ఉండాలి. అప్పుడే ఆట రసవత్తరంగా ఉంటుంది. బలమైన పాత్ర రాసుకున్న హను రాఘవపుడి, అతడికి ఓ వెరైటి బలహీనత పెట్టాడు.

ఆలోచన బాగుంది. హీరో క్యారక్టర్ కూడా రొటీన్ కి భిన్నంగా, అబద్ధాల చుట్టూ రాసుకున్నాడు. ఈ ఆలోచన కూడా బాగుంది.

కాని థ్రిల్లర్స్ లో వచ్చే సమస్య ఏమిటంటే, ఏ కొంచెం పట్టు తప్పినా క్షమించరు ప్రేక్షకులు. లై బాగుందా బాగాలేదా అనే డిస్కషన్ కొన్నిరోజులు ప్రేక్షకుల మధ్య జరగనుంది. ఎందుకంటే ఇది రొటీన్ సినిమా కాదు, అలాగనే పూర్తిగా రసవత్తరంగా సాగే సినిమా కూడా కాదు.

కమర్శయాలిటి కోసం పెట్టిన పాటలు ఒక్కోసారి కథనంలో స్పీడ్ బ్రేక్స్ లాగా అనిపిస్తే, హానెస్ట్ గా వెళ్ళిన కొన్ని సీన్లు కొంచెం నీరసాన్ని తెప్పిస్తాయి. కాబట్టి ఈ సినిమా మీద ఇప్పుడే ఓ అంచనాకి రాలేం. ఫలితం ప్రేక్షకుల చేతిలోనే ఉంది.

అయితే మాస్ ప్రేక్షకులని మెప్పించడం మాత్రం కష్టం. పైగా బోయపాటి శ్రీను లాంటి ఊరమాసు డైరెక్టర్ ధాటికి ఈ యావరేజ్ థ్రిల్లర్ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.ప్లస్ పాయింట్స్ :* ప్రొడక్షన్ వాల్యూస్

* విలన్ – హీరో

* ఇంటర్వల్ కి ముందు ఎపిసోడ్స్..

* సంగీతంమైనస్ పాయింట్స్ :..

* పట్టుతప్పిన సెకండాఫ్.

* స్పీడ్ బ్రేకర్స్ లాంటి పాటలు..

* థ్రిల్ ని తగ్గించే నిడివి.

తెలుగు స్టాప్ రేటింగ్ : 2.75/5