గ్యాస్‌ లీకేజీ కేసు కీలక పరిణామం  

LG Polymers, Gas leakage, AP high Court Grants Bail on Gas leakage, Vizag gas leak - Telugu Ap High Court Grants Bail On Gas Leakage, Gas Leakage, Lg Polymers, Vizag Gas Leak

విశాఖపట్నం సమీపంలోని వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ ఫాలిమర్స్‌ నుండి స్టైరీన్‌ విషవాయువు అర్థరాత్రి లీక్‌ అయ్యి 14 మంది మృతి చెందిన విషయం తెల్సిందే.ఈ ఘటన జరిగి మూడు నెలలు అయ్యింది.

TeluguStop.com - Lg Polymers Vizag Case Ap High Court Grants Bail

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

విశాఖ పోలీసులు ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్‌ చేశారు.అరెస్ట్‌ అయిన వారిలో ఎల్జీ పాలీమర్స్‌ సీఈఓ మరియు డైరెక్టర్స్‌ కూడా ఉన్నారు.

TeluguStop.com - గ్యాస్‌ లీకేజీ కేసు కీలక పరిణామం-General-Telugu-Telugu Tollywood Photo Image

దక్షిణ కొరియాకు చెందిన వారు కూడా అరెస్ట్‌ అయిన వారిలో ఉండటంతో చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.ఈ కేసు విచారణలో భాగంగా ఇన్ని రోజులు వారిని కస్టడీకి తీసుకున్న పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు.

గత కొన్ని రోజులుగా ఈ కేసులో అరెస్ట్‌ అయిన అందరు కూడా బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఎట్టకేలకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు దేశం విడిచి వెళ్లి పోకుండా ఉండాలంటూ ఆదేశించడంతో పాటు విచారణలో ఎప్పుడు అవసరం అయినా వెంటనే అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చిన తర్వాత వారికి బెయిల్‌ ను మంజూరు చేసినట్లుగా న్యాయ వాదులు పేర్కొన్నారు.ఈ కేసులో మృతి చెందిన బాధితులను ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ఆదుకోలేదు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

#LG Polymers #Vizag Gas Leak #Gas Leakage #APHigh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lg Polymers Vizag Case Ap High Court Grants Bail Related Telugu News,Photos/Pics,Images..