మన్యంలో మావోయిస్టుల కరపత్రాల కలకలం   Letter Relised By Mavoyists At Visaka Manyam     2018-10-29   11:26:52  IST  Sai M

విశాఖ మాన్యంపై మావోయిస్టులు పూర్తి స్థాయిలో గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే… అరకు ఎమ్యెల్యే కిడారి సర్వేశ్వరరావు , మాజీ ఎమ్యెల్యే సోమాను కాల్చి చంపిన మావోలు తమ ఉనికి కోసం అనేక అలజడులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా.. విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట కరపత్రాలు, బ్యానర్లు కనిపించడం కలకలం సృష్టించాయి. గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున వీటిని వెదజల్లినట్లు సమాచారం.

చట్టాల ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ది సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టి గిరిజనుల బతుకులను నాశనం చేయడానికి పూనుకున్న అధికార తెదేపా, భాజపా నాయకులను మన్యం నుంచి తరిమి కొట్టాలని మావోయిస్టులు ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.