చట్ట సభల ద్వారా ముదిరాజ్ హక్కులను సాధిద్దాం.. -మండల అధ్యక్షుడు బోయిని చంద్రయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో శుక్రవారం రోజున ముదిరాజుల మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల పైచిలుక ఉన్న ముదిరాజ్ కులస్తులను మరచిపోయి ఏమాత్రం మేము ఉన్నామని గుర్తు లేకుండా ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం పట్ల కెసిఆర్ కు ముదిరాజులపై ఉన్న వ్యతిరేకత అర్థం అవుతుందని అన్నారు.

దీనికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రోజున పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ముదిరాజ్ కులస్తులు చాలా వరకు ఎంతో వెనుకబాటులో ఉన్నారని,చట్ట సభల్లో ముదిరాజులు అడుగుపెట్టి ముదిరాజుల హక్కులను సాదించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాబోవు ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే ముదిరాజులను విస్మరించి టికెట్ కేటాయించకపోతే తప్పనిసరి ముదిరాజుల పవర్ ఏందో చూపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల అధ్యక్షులు బోయిని చంద్రయ్య,ఉప అధ్యక్షులు దండవేని నర్సయ్య,బోయిని రాజు,కార్యదర్శి గండి నారాయణ,ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

పదవి విరమణ పొందిన అధికారని సన్మానించి జ్ఞాపకం అందజేసిన ఎస్పీ..
Advertisement

Latest Rajanna Sircilla News