తెలుగు వారు గర్వపడేలా....అమెరికాలో తానాకు అరుదైన గుర్తింపు...!!!

తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) గుర్తించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.విదేశాలలో ఉన్న తెలుగు ప్రవాసులు అందరికి సుపరిచితమైన పేరు తానా.

 Let Telugu People Be Proud Tana Has A Rare Recognition In America , Tana – Ash-TeluguStop.com

ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులకు, తెలుగు వారికి తానా సేవల గూర్చి తప్పకకుండా తెలుస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగు సంఘాలకంటే కూడా తానా అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందింది.

ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న తెలుగు వారి అభివృద్ధికోసం, తెలుగు భాషాభివృద్ది కోసం నిర్విరామంగా కృషి చేస్తోంది తానా.తెలుగు పండుగలు, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను నలు దిశలా విస్తరిస్తూ అక్కడి తెలుగు భవిష్యత్త్ తరాలకు మన తెలుగు దనం తెలిసేలా చేయడంలో తానా కృషి అభినందనీయం.

కేవలం అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రలలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సైతం తానా ఎప్పుడూ ముందుంటుంది.అలాగే అమెరికాలో తెలుగు వారికి మాత్రమే కాకుండా అక్కడి స్థానికంగా ఉన్న పేద వారికి, అనాధాశ్రమాలకు సాయం చేయడం కోసం ఫుడ్ డ్రైవ్ లు నిర్వహిస్తూ తనవంతు సాయం అందిస్తుంది.

ఈ క్రమంలో ఎన్నో గుర్తింపులు, ప్రశంసలు దక్కించుకున్న తానా తాజాగా మరో అమెరికాలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.ఇప్పటిక్ వరకూ ఏ తెలుగు సంస్థకు లేని గౌరవాన్ని తానా సొంతం చేసుకుంది.

Telugu Acorn, America, Indians, Mayordaniel, Ohio, Tana, Tanaashok, Telugu Nris-

ఇకపై ప్రతీ ఏటా ఆగస్టు 26 ను తానా – అశోక్ కొల్లా డే గా గుర్తిస్తూ ఒహాయో రాష్ట్ర మేయర్ డేనియల్ హోరిగన్ కీలక ప్రకటిన చేశారు.తానా తమ కమ్యూనిటీ కి మాతమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా ఎంతో సాయం అందిస్తోందని, ఎంతో మంది అమెరికన్స్ తానా సాయం పొందారని కరోనా మహమ్మారి సమయంలో ఆక్రాన్ ప్రజలకు తానా భోజనం, మందులు అందించారని అందుకే వారి సేవలను గుర్తించి ఈ గుర్తింపు ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించారు.కరోనా సమయంలో అశోక్ కొల్లా చేసిన సేవలు అభినంద నీయమని , తానా తరుపున ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉందంటూ తానా సభ్యులు తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube