సింగపూర్ వ్యక్తితో శంకరాభరణం రాజ్యలక్ష్మికి పెళ్లి ఎలా సెట్ అయ్యిందో తెలుసా?

సాధారణంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొంతమంది సెలబ్రిటీలకు వారు నటించిన సినిమా పేర్లు వారి ఇంటి పేర్లుగా మారిపోతాయి.అలా సినిమా పేర్లను ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు శుభలేఖ సుధాకర్ రావు, ఆహుతి ప్రసాద్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి వారు ఉన్నారు.

 Lesser Known Facts About Sankarabharanam Rajyalakshmi Married Life-TeluguStop.com

ఇలాంటి కోవకు చెందినవారే శంకరాభరణం రాజ్యలక్ష్మి.ఈమె శంకరాభరణం సినిమాలో నటించడం వల్ల ఈమెకు శంకరాభరణం రాజ్యలక్ష్మి అనే పేరు వచ్చింది.

మొదటి సినిమా శంకరాభరణం పూర్తికాకుండానే ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్న రాజలక్ష్మి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషలలో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు పొందారు.

 Lesser Known Facts About Sankarabharanam Rajyalakshmi Married Life-సింగపూర్ వ్యక్తితో శంకరాభరణం రాజ్యలక్ష్మికి పెళ్లి ఎలా సెట్ అయ్యిందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందరి హీరోయిన్స్ మాదిరిగానే ఈమె కూడా తన కెరీర్ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు సింగపూర్ కు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.అసలు హీరోయిన్ గా స్థిరపడిన ఈమె సింగపూర్ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందనే విషయం తెలిస్తే కొంత ఆశ్చర్యం కలగక మానదు.

ఒకసారి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ కి బయటకు వెళ్ళిన రాజ్యలక్ష్మి తన కజిన్ తో పాటు ఒక అబ్బాయి వచ్చాడు.అతను సింగపూర్ లోనే నివాసం ఉంటున్నాడు.

ఇలా పరిచయాలు చేసుకున్న తర్వాత రాజ్యలక్ష్మి తన షూటింగ్ కోసం సింగపూర్ వస్తున్నానని చెప్పినప్పుడు అందుకు అతను తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి మీకు ఏదైనా అవసరమైతే తప్పకుండా కలవండి సహాయం చేస్తానని చెప్పారు.

Telugu Intresting Facts, Marriage, Sankarabaranam Rajyalakshmi, Singapur, Tollywood-Movie

ఇలా అప్పటికే అతనికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నప్పటికీ ఏ ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు.ఈ క్రమంలోనే రాజలక్ష్మిని చూసిన మొదటి చూపులోనే ఆమె నచ్చడంతో అతను మీరు నాకు నచ్చారు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడగడంతో రాజ్యలక్ష్మి మా ఇంట్లో వాళ్లకి ఎలాంటి అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.ఈ క్రమంలోనే అతను వాళ్ళ అన్నయ్యతో రాజ్యలక్ష్మి తల్లిదండ్రులతో మాట్లాడగా మా అమ్మాయికి ఇష్టమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

దీంతో వీరిద్దరికీ పెళ్లి కుదిరింది.అయితే ఒక నెల టైం తీసుకుని తను ఒప్పుకున్న సినిమాలు అన్నింటినీ పూర్తిచేసుకుని వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ఈమెకు వెంటవెంటనే ఇద్దరు కొడుకులు జన్మించారు.పిల్లలు పెద్దవారు అయ్యేవరకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాజ్యలక్ష్మి తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించారు.

ప్రస్తుతం తన పెద్ద కుమారుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటికీ తన భర్త సింగపూర్ లోనే ఉంటారని తనకు షూటింగ్ లేని సమయంలో సింగపూర్ కి వెళ్తున్నట్లు ఓ సందర్భంలో రాజ్యలక్ష్మి తెలియజేశారు.

#Singapur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు