లేపాక్షి విషయం లో జగన్ ని ఇంకా ఒదల్లేదు

లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూముకు కేటాయించిన విషయంలో ఐఏఎస్ అధికారి శ్యాంబాబును విచారణ నుంచి మినహాయిస్తూ హైకోర్టులో రిలీఫ్ రాగా, ఈ కేసు భవిష్యత్తు ఆసక్తికరంగా మారింది.ఆనాటి మంత్రివర్గ నిర్ణయం మేరకు మాత్రమే కేటాయింపులు జరిగాయని, మంత్రివర్గ తీర్మానాన్ని తానెలా అడ్డుకోగలనని, సీబీఐ తప్పుడు కేసు పెట్టిందని శ్యాంబాబు చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

 Lepakshi Case Still Following Jagan-TeluguStop.com

ఆయన ప్రాసిక్యూషన్ అక్కర్లేదని జస్టిస్ ఇళంగో తీర్పిచ్చారు
ఇక ఇదే కేసులో జగన్ ప్రమేయంపై కూడా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.కేటాయింపులు జరిగిన సమయంలో జగన్ మంత్రి కాదు.

మంత్రివర్గ సమావేశంలో ఆయన లేడు.శ్యాంబాబుకు క్లీన్ చిట్ వచ్చిన నేపథ్యంలో, కేసు జగన్ కు కాస్తంత అనుకూలంగా మారినట్టేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

ఇక ఐఏఎస్ అధికారిపై విచారణకు ఏపీ ప్రభుత్వం సైతం డిమాండ్ చేయలేదు.ఇక ఇప్పుడు కేసు తదుపరి విచారణలో భాగంగా జగన్ పై ఆరోపణలను ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube