కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఏ సినిమా చేసిన కూడా కోలీవుడ్ లో సంచలనమే.యావరేజ్ టాక్ వచ్చిన 200 కోట్లను కలెక్ట్ చేసే సత్తా ఉన్న స్టార్ విజయ్.
మరి అలాంటి హీరో తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా తెరకెక్కుతుంది.లోకేష్( Lokesh Kanagara ) యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రకటించినప్పటి నుండే భారీ డిమాండ్ ఉంది.ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఇటీవలే విజయ్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండడంతో మేకర్స్ ఫాస్ట్ గా పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఇక రిలీజ్ దగ్గర పడే లోపు ఈ సినిమా కోసం భారీ ప్లాన్ సిద్ధం చేసి పెట్టనున్నారు.
సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మలేషియాలో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారట.ఈ విషయం బయటకు రావడంతో ఇదే నిజమైతే కోలీవుడ్ లో లియో సంచలనంగా మారడం ఖాయం అంటున్నారు.
చూడాలి మేకర్స్ ఏం చేస్తారో.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష ( Trisha )హీరోయిన్ గా నటిస్తుందిగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.