చిరుతల కలకలం.. మహబూబ్ నగర్ ప్రజలకు అధికారులు హెచ్చరిక..!

దేశంలో కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ ఫలితంగా కొన్ని రోజులుగా ప్రజలు బయట సంచరించక పోవడంతో అడవిలో ఉండే వన్యమృగాలకు స్వేచ్చ దొరికినట్లు అయ్యింది.అందుకే అడవులను వదిలి జనావాసాల బాటపట్టాయి.

 Leopards Tension In Mahabubnagar District People Must Be Alert,  Telangana, Maha-TeluguStop.com

ఇప్పటికే ఎందరో మనుషులు, పశువులు వీటి బారినపడ్డాయి.అంతే కాకుండా గ్రామాల్లో ఉండే మేకలపైనా దాడులు చేస్తున్నాయి.దీని వల్ల కొన్ని గ్రామాల్లో నివసించే ప్రజలకు ఈ కౄరమృగాల భయం పట్టుకుంది.ఇక ఇటీవల కాలంలో తెలంగాణలో పులులు, చిరుతల సంచారం ఎక్కువైంది.

ఈ క్రమంలో కొమురం భీం జిల్లాలో తెల్లవారు జామున ఓ పులి గ్రామంలోకి ప్రవేశించి ఎద్దును చంపేసింది.

Telugu Devarakadra, Cow, Leopard, Mahabubnagar, Nagaram, Telangana, Leopards-Lat

ఇక తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి.ఇకపోతే దేవరకద్ర మండలంలోని నాగారం గ్రామం శివారులో ఓ చిరుత లేగదూడను చంపి తినేసింది.అదీగాక ముచ్చింతల్ లో రెండు చిరుతలు సంచరిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు.

అందువల్ల మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube