యాచారం పరిధిలో గ్రామంలోకి చొరబడ్డ చిరుత!

యాచారంలో పరిధిలో నక్కర్తపల్లిలో చిరుత గ్రామంలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది.గత కొంత కాలంగా చిరుతలు అటవీప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.

 Leopard Scare Grips Kothapally Villagers-TeluguStop.com

చిరుతలు జనావాసాల్లో చేరి ప్రజలని భయబ్రాంతులకి గురి చేయడం, దాడి చేయడం, అలాగే పశువులపై దాడి చేయడం చేస్తున్నాయి.ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది.

అటవీప్రాంతంకి ఆనుకొని వుండే గ్రామాలలో ప్రజలు చిరుతల దాడికి గురవుతున్నారు.

తాజాగా తెలంగాణలో యాచారం పరిధిలో కూడా నక్కర్తపల్లి గ్రామంలోకి చిరుత ప్రవేశించడంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళకి గురవుతున్నారు.

ఇప్పటికే గ్రామంలో పశువులపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తుంది.ఇక గ్రామస్తుల నుంచి చిరుత సంచారం గురించిన సమాచారం అటవీశాఖ అధికారులకి తెలియజేయడంతో దానిని పట్టుకునే ప్రయత్నం ఇప్పుడు అటవీశాఖ సిబ్బంది చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube