సాధారణంగా పిల్లలు చాలా విషయాల్లో తల్లిదండ్రులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు.తల్లిదండ్రులు ఏ విధంగా పని చేస్తారో తాము కూడా అదే విధంగా చేయాలని అనుకుంటూ ఉంటారు.
మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇదే తరహా నైజం ఉంటుంది.తాజాగా ట్విట్టర్ లో చిరుత, పిల్ల చిరుతకు సంబంధించిన ఒక వీడియో ట్రెండింగ్ లో ఉంది.
తల్లి చిరుత, పిల్ల చిరుత ఒక గోతిలో ఒకే విధంగా నీళ్లు తాగుతుండటం నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.
తల్లి చిరుత, పిల్ల చిరుత నీళ్లు తాగడం కోసం ఒకే పొజిషన్ లో ఒకే విధంగా ఉండడం నెటిజన్లను మెప్పిస్తోంది.అదే సమయంలో వెనుకనుంచి వినిపిస్తున్న పక్షుల కిలకిలారావాలు హృదయాలను హత్తుకుంటున్నాయి.
చిరుతలు నీళ్లు తాగే విధానం స్పష్టంగా ఉండటం తల్లి చిరుత, పిల్ల చిరుత ఒకే విధంగా నీళ్లు తాగడం చూడముచ్చటగా ఉంది.
తల్లి చిరుత, పిల్ల చిరుత మ్యాచింగ్ మ్యాచింగ్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.11,900 మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించగా 1,300 లైకులు 179 రీట్వీట్లలో ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.కొందరు నెటిజన్లు తల్లి చిరుత, పిల్ల చిరుత మధ్య కో ఆర్డినేషన్ భలే ఉందే.? అని కామెంట్లు చేస్తున్నారు.నెటిజన్లను మైమరిచిపోయేలా చేస్తున్న ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.