చిరుత పులి అంటే మనందరికీ ఎంతో భయం.ఇక ఏకంగా మనకు ఎదురైతే మనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయక తప్పదు.
లేదంటే ఇక మనల్ని దాడి చేయడం ఖాయం.కాని మనం ఏదైనా జూకు వెళ్ళినప్పుడు పులిని దూరం నుండి చూస్తాం కాబట్టి మనకు అంతగా భయం వేయదు.
ఎందుకంటే అది మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు.కాబట్టి సరదాగా దూరం నుండి ఫోటోలు తీస్తూ మనం ఆనందించవచ్చు.
కాని ఏకంగా పులి మన దగ్గరికి వచ్చి మనతో అడుకుంటే ఎలా ఉంటుంది.ఏంటి పులి మనుషులతో ఆడుకోవటం ఏంటని అనుకుంటున్నారా.
అయితే మీరు ఇది చదవాల్సిందే.హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు లోని తీర్థన్ వ్యాలీలో రోడ్డు మీద గుండా వెళ్తున్న పర్యాటకులతో సరదాగా ఆడుకుంటున్న చిరుతపులి పెద్ద పాపులారిటీని సంపాదించుకుంది.
అటుగా వెళ్తున్న పర్యాటకులను సమీపించి వాళ్ళను పలకరిస్తోంది.పర్యాటకులు మొదట కాస్త భయపడ్డా, తరువాత దానిని పలకరిస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని కొంత మంది పర్యాటకులు వీడియో తీసి నెట్టింట్లో వదిలారు.నెటిజన్ల లైక్ లు,షేర్లతో ఈ వీడియో వైరల్ గా మారింది.
మీకూ చూడాలని ఉంది కదా.ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి మరి.
.