టైటానిక్ హీరోని కదిలించిన చెన్నై నీటి ఎద్దడి  

చెన్నైలో నీటి ఎద్దడి గురించి స్పందించిన హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో..

Leonardo Dicaprio Posts About Chennai Water Crisis-

ఈ వేసవి కాలం దేశంలో ఎన్నడూ లేని స్థాయిలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చి ప్రజలని ఇబ్బందులకి గురి చేసింది.ప్రధాన పట్టణాలలో ఇక ఈ వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోయారు.చుక్క నీటి కోసం నిత్యం అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది.ఇక చెన్నైలో ఈ వేసవి తాపం కారణంగా ప్రజలు అల్లాడిపోయారు.అధికారులు ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన కూడా నీటి ఎద్దడిని అరికట్టలేకపోయారు.చెన్నైలో నీటి కష్టాలకి సంబంధించిన ఒక ఫోటోని హాలీవుడ్ స్టార్ నటుడు లియోనార్డో డికాప్రియో తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసాడు.

Leonardo Dicaprio Posts About Chennai Water Crisis--Leonardo DiCaprio Posts About Chennai Water Crisis-

ఇది వరకు ఢిల్లీలోని ఘాజీపూర్ డంపింగ్ యార్డ్‌లో చెత్త తాజ్‌మహల్‌ ఎత్తును దాటేస్తోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చేసిన వీడియోను ఇటీవల ఇన్‌స్టాగ్రంలో పోస్ట్ చేసిన డికాప్రియో మరోమారు నీటి ఎద్దడిపై తన స్పందన తెలియజేసారు.చెన్నై నీటి కష్టాలపై డికాప్రియో తన ఇన్‌స్టాగ్రం ఖాతాలో ఫోటో పెట్టి, చెన్నై నగరాన్ని ప్రస్తుత పరిస్థితి నుంచి వానలు మాత్రమే కాపాడగలవు.

బావులలో చుక్క నీరు లేదు.నాలుగు రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో భారతదేశంలోని చెన్నై నీటికొరతను ఎదుర్కొంటోంది.ఈ పరిస్థితితో ప్రభుత్వం వాటర్ ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీటి కోసం గంటల తరబడి క్యూలైన్లలో ప్రజలు నిల్చుంటున్నారు.ప్రత్యామ్నాయ నీటి వనరుల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.ప్రజలు మాత్రం వానలు పడాలని ప్రార్థిస్తూనే ఉన్నారు.అంటూ బావిలో నీళ్లు తోడుకునే ఫొటోను జతచేసి పోస్ట్ పెట్టాడు.ఇప్పుడు ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది.