'జైలర్' కి దరిదాపుల్లో రాలేకపోయిన 'లియో'..సూపర్ స్టార్ మాస్ అంటే ఇదే !

ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలకు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఉండొచ్చు , కానీ సీనియర్ హీరోల స్టార్ డమ్ ని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదు.తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

 'leo' Who Couldn't Come Close To 'jailer'...this Is What Superstar Mass Means ,-TeluguStop.com

తమిళనాడు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) గారే, ఆ స్థాయిలో ఆయన తన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా పెద్ద వయస్సు వచ్చినప్పుడు యూత్ ఆడియన్స్ లో క్రేజ్ తగ్గడం సహజమే.

రజినీకాంత్ విషయం అది జరగలేదు కానీ , ప్రస్తుతం తమిళనాడు లో ఉన్న స్టార్ హీరోలు అజిత్, విజయ్( Talapathy vijay ) లతో పోలిస్తే కాస్త వెనకబడ్డాడు.యూత్ లో వాళ్ళకంటే వెనబడ్డాడు అని రజినీకాంత్ కి బాక్స్ ఆఫీస్ స్టామినా కూడా పోయింది అంటూ కామెంట్స్ వినిపించాయి.

Telugu Jailer, Kollywood, Leo, Rajinikanth, Talapathy Vijay, Tollywood, Vinayaka

ఎందుకంటే ‘జైలర్’ కి ముందు రజినీకాంత్ కి వరుసగా ఫ్లాప్స్ రావడమే అందుకు కారణం.కానీ ‘జైలర్’ చిత్రం( Jailer movie ) తర్వాత తన బాక్స్ ఆఫీస్ స్టామినా చెక్కు చెదరలేదు అని మరోసారి నిరూపించుకున్నాడు సూపర్ స్టార్.తెలుగు , తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపుగా 620 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.ఈ సినిమా రికార్డ్స్ ని తమిళ హీరో విజయ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘లియో‘ బద్దలు కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు.

కొన్ని ప్రాంతాలలో జైలర్ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది కూడా.కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘జైలర్’ చిత్రానికి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది ఈ సినిమా.ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం జైలర్ చిత్రానికి మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Telugu Jailer, Kollywood, Leo, Rajinikanth, Talapathy Vijay, Tollywood, Vinayaka

కానీ లియో చిత్రానికి( Leo movie ) ఇప్పటి వరకు కేవలం పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఫుల్ రన్ లో మరో మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంచనా.ఇది కచ్చితంగా మంచి వసూళ్లే, కానీ జైలర్ కి దరిదాపుల్లోకి కూడా రాకపోవడం విశేషం.‘జైలర్’ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ని ఈ వీకెండ్ తో తమిళ నాడు లో , అలాగే కేరళ లో క్రాస్ చేయబోతుంది ‘లియో’ చిత్రం.కానీ నార్త్ అమెరికా మరియు కర్ణాటక వంటి ప్రాంతాలలో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది ఈ చిత్రం.ప్రస్తుతానికి 530 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన లియో చిత్రం ఫుల్ రన్ లో ‘జైలర్’ 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube