వైరల్ వీడియో: మనసుని కదిలించేలా మెస్సి వీడియో కాల్..!

కోపా అమెరికా ఫైనల్‌ మ్యాచ్ లో అర్జెంటీనా జట్టు బ్రెజిల్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఈ మెగా ఈవెంట్‌లో బ్రెజిల్, అర్జెంటీనా మూడు సార్లు తలపడగా తొలి సారి అర్జెంటీనా కప్పు గెలిచింది.1993 తర్వాత అర్జెంటీనా టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి.శనివారం రాత్రి రియో డి జనైరోలోని మరకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తేడాతో విజయం సాధించింది.

 Leo Messi Video Call After Winning Copa America Final Match Vs Brazil , Viral Vi-TeluguStop.com

అయితే హోం గ్రౌండ్‌లో ఆడుతున్న బ్రెజిల్ కనీసం ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది.మ్యాచ్ ప్రారంభమైన 22వ నిమిషంలో అర్జంటీనా ఆటగాడు ఆంజెల్ డి మారియా చేసిన ఏకైక గోల్ అర్జెంటీనాను గెలిపించింది.

అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ కెరీర్‌లో ఇదే తొలి మేజర్ టైటిల్ కావడం విశేషంగా చెప్పొచ్చు.అర్జెంటీనా సీనియర్ జట్టు తరపున మెస్సీ తొలి సారి కోపా అమెరికా టైటిల్ ను సాధించాడు.

ఫైనల్ విజిల్ ఊదగానే అర్జెంటీనా ఆటగాళ్లందరూ ఒక్కసారిగా మెస్సీ వైపు పరుగెత్తి సంబరాలు చేసుకున్నారు.

మెస్సీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తన కెరీర్‌లో ఒక మేజర్ టైటిల్ గెలవడం తొలిసారి కావడంతో మెస్సీ నోటి వెంట మాటలు రాలేదు.దక్షిణ అమెరికా చాంపియన్లుగా అర్జెంటీనా 28 ఏళ్ల తర్వాత నిలవడంతో అర్జెంటీనా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి.2014 ఫిఫా వరల్డ్ కప్ గెలవలేకపోయిన లోటును మెస్సీ ఈ కప్ గెలవడంతో తీర్చుకున్నాడు.

డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ సొంత గ్రౌండ్‌లో ఫైనల్ ఓడిపోవడంతో అభిమానులు కంటనీరు పెట్టుకున్నారు.కాగా కోపా అమెరికా చరిత్రలో అత్యధికంగా అర్జెంటీనా 15 టైటిల్స్ గెలిచి ఉరుగ్వేతో సమానంగా నిలిచింది.అర్జెంటీనా తరపున 16 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ ఎట్టకేలకు తన దేశం కోసం ఒక మేజర్ టైటిల్ గెలిచాడు.

యూరోపియన్ లీగ్స్‌లో తిరుగే లేని ఆటగాడు, కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కిన మెస్సీ ఖాతాలో 34 ట్రోఫీలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube