ఇకనుంచి కీబోర్డు లేని ల్యాప్‌టాప్‌

మనం ఈ రోజు వరకు కీ బోర్డు లేని స్మార్ట్ ఫోన్స్ మాత్రమే చూసాం కానీ త్వరలో కీ బోర్డులేని ల్యాప్‌టాప్‌ రానున్నాయి.పాత ల్యాప్‌టాప్‌ ల స్థానంలో ఇప్పుడు హైబ్రిడ్‌ ల్యాప్‌టాప్స్‌, డాక్‌ఇన్‌ లాప్‌టాప్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి.

 Lenovo Announces A New Keyboard-less Laptop-TeluguStop.com

ఐతే లెనోవా సంస్థ మరో కొత్త రకం ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది.బెర్లిన్‌లో జరుగుతున్న ‘ఐఎఫ్‌ఏ 2016’లో తన తాజా పాకెట్‌ సైజ్‌ యోగా లాప్‌టాప్‌ను విడుదల చేసింది.

-Top Posts Featured Slide

ఈ ల్యాప్‌టాప్‌కు 10.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ ఉంది.కేవలం 4.55 మి.మీ మందంతో 690 గ్రాముల బరువు ఉంది.దీనిలో కీబోర్డు బదులు హాలో కీబోర్డును ఉపయోగించారు.

దీంతో కీబోర్డు బటన్స్‌ పైకి కనిపించవు.అవసరమైప్పుడు మాత్రమే కీబోర్డులా వాడుకోవచ్చు.ఓ నల్లని బోర్డులా ఉండే దీనిపై స్టైలస్‌ పెన్‌ ద్వారా లెనోవా యాప్స్‌ సహాయంతో బొమ్మలు గీయడం, నోట్స్‌ రాసుకోవడం వంటివి చేయొచ్చు.360 డిగ్రీల్లో ఈ ల్యాప్‌టాప్‌ను ఎలాకావాలంటే అలా మడుచుకునే వీలుంది.ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, నోట్‌బుక్‌ ఇలా కావాల్సిన విధంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube