వైరల్‌ వీడియో : ఇది చూస్తే బయట ఏం తాగాలన్నా, తినాలన్నా ఆలోచిస్తారు  

Lemon Water Prepared Under Unhygienic Condition At Kurla Station-

పొద్దున లేస్తే మనం బయట ఏదో ఒక పదార్థం తినడం లేదా డ్రింక్స్‌ తాగడం చేస్తూ ఉంటాం.వాటిని ఎలా తయారు చేస్తున్నారు, తయారు చేస్తున్న వారు ఏ మేరకు శుభ్రతను పాటిస్తున్నారు అనే విషయాన్ని మనం అస్సలు పట్టించుకోం.ఒక వేళ అలా పట్టించుకుంటే మాత్రం బయట కనీసం మంచి నీళ్లు కూడా తాగలేని పరిస్థితి ఉంటుంది...

Lemon Water Prepared Under Unhygienic Condition At Kurla Station--Lemon Water Prepared Under Unhygienic Condition At Kurla Station-

తాజాగా మహారాష్ట్రలోని కుర్లా రైల్వే స్టేషన్‌లో ఒక నిమ్మరసం అమ్మే వ్యాపారి దాన్ని తయారు చేస్తున్న విధానంను చూసిన జనాలు అవాక్కవుతున్నారు.ఇంత కాలం అతడి వద్ద నమ్మరసం తాగిన వారు దీన్ని తల్చుకుంటేనే కడుపులో తిప్పుతుంది.వేరే వారు బయట తాగాలంటే, తినాలంటే భయపడుతున్నారు.

Lemon Water Prepared Under Unhygienic Condition At Kurla Station--Lemon Water Prepared Under Unhygienic Condition At Kurla Station-

ఇంట్లో వండిన వాటికంటే బయట పదార్థాలు మనకు నచ్చుతాయి.కాని వాటిని తయారు చేస్తున్న విధానం మాత్రం దారుణంగా ఉంది.కుర్లా రైల్వే స్టేషన్‌లో వ్యక్తి నిమ్మరసం అమ్ముతున్నాడు.వేసవి ప్రారంభం అయిన నేపథ్యంలో రోజుకు వంద లీటర్లకు పైగానే అతడు నిమ్మరసం అమ్ముతూ ఉన్నాడు.

వంద లీటర్ల నిమ్మరసం అమ్మడం ద్వారా అతడికి భారీగానే డబ్బులు వస్తున్నాయి.అయితే అతడు పెట్టుబడిగా మాత్రం కేవలం నిమ్మ కాయలను మాత్రమే తీసుకు వస్తున్నాడు.రైల్వే స్టేషన్‌లోనే ఒక పాడుబడ్డ డ్రమ్‌లో మామూలు వాటర్‌ నింపి, శుచి శుబ్రంలేకుండా నిమ్మరసం కలుపుతున్నాడు..

వారంతా కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది.డబ్బులు తీసుకున్నందుకు వారికి తగ్గట్లుగా శుబ్రంగా పానియాలు లేదంటే ఆహారం ఇస్తే బాగుంటుంది కదా అనే విషయాన్ని వారు గుర్తించాలి...

ఈ వీడియో చూసిన వారు రెండు మూడు రోజులు బయట తినాలన్నా, తాగాలన్నా ఇబ్బంది పడతారు, ఆ తర్వాత మళ్లీ మామూలే.ఇది ఎప్పుడు జరుగుతున్న విషయమే.

అయితే ఇలాంటివి బయటకు వచ్చిన సమయంలో వ్యాపారులు కాస్త జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి దారుణాన్ని చెప్పడం జరుగుతుంది...

ఈ విషయాన్ని తప్పకుండా నలుగురితో షేర్‌ చేసుకోండి.