మోచేతుల నలుపు పోవటానికి ...నిమ్మ,పుదీనా బ్లీచ్

చేతులు నున్నగా,మెరుస్తూ అందంగా ఉండాలని మనం ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటాం.కానీ మోచేతుల నలుపు గురించి పెద్దగా పట్టించుకోము.

 Lemon Mint Elbow Bleach Recipe-TeluguStop.com

దాంతో అక్కడి చర్మం నల్లగా, దళసరిగా మారుతుంది.మోచేతుల చర్మంలో నూనె గ్రంధులు తక్కువగా ఉండుట వలన పొడిగా, దళసరిగా మారుతుంది.

ఈ సమస్యను అదుపులో ఉంచుకోవటానికి ఒక చిట్కా ఉంది.ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

నిమ్మ,పుదీనా బ్లీచ్

నిమ్మరసం,పుదీనాతో తయారుచేసిన బ్లీచ్ సాయంతో మోచేతుల నలుపు పోగొట్టవచ్చు.నిమ్మరసం సహజసిద్ధమైన బ్లీచ్ గా పనిచేస్తే, పుదీనా చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది.

కావలసిన పదార్ధాలు

నిమ్మచెక్క – 1

నీరు – అరకప్పు

పుదీనా ఆకులు – గుప్పెడు లేదా పుదీనా పొడి ఒక స్పూన్

తయారి విధానం అరకప్పు నీటిలో ఒక స్పూన్ పుదీనా పొడి వేసి మరిగించాలి.ఈ మిశ్రమాన్ని వడకట్టి నిమ్మరసం కలపాలి.

ఇలా వాడాలి

ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి మోచేతులు రాసి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube