ఇమ్యూనిటీ పెంచుకోవ‌డానికి నిమ్మ‌రసం ఇలా తాగితే.. డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్టే!!

What Happens When You Over Drink Of Lemon Juice? Lemon Juice, Health Tips, Health, Latest News, Lemon, Immunity Power,

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.క‌రోనా ఉధృతికి అగ్ర‌రాజ్యాలు సైతం హ‌డ‌లెత్తిపోతున్నాయి.

 What Happens When You Over Drink Of Lemon Juice? Lemon Juice, Health Tips, Healt-TeluguStop.com

ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అందుబాటులో లేక‌పోవ‌డం.అస‌లు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందో కూడా తెలియ‌క‌పోవ‌డం.

ప్ర‌పంచ‌దేశాల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే.

ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచుకోవాల‌ని నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తున్నారు.ఇక రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ చాలా నిమ్మరసం తాగుతుంటారు.

ఎందుకంటే.నిమ్మరసంలో ఉండే విటమిన్-సీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది.నిమ్మరసం లో ఉండే యాసిడ్ ఆమ్లాలు కడుపులోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని నిమ్మ‌ర‌సం అతిగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఎందుకంటే.నిమ్మలో అసిడిక్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది.ఇది హార్ట్ బర్న్, చెస్ట్ పెయిన్, వికారం, వాంతులు వంటి వాటికి దారితీస్తుంది.

అలాగే నిమ్మ‌ర‌సం అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపునొప్పి, మోష‌న్స్ వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

అలాగే నిమ్మ‌ర‌సం అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల ఇందులో టైరామిన్ అనే అమినో యాసిడ్ మొద‌డుకు సడెన్ గా రక్తప్రవాహాన్ని పెంచుతుంది.

దీని వ‌ల్ల మైగ్రేన్ త‌ల‌నొప్పికి దారితీస్తోంది.ఇక నిమ్మ‌ర‌సంలో ఉండే ఎసిడిక్ యాసిడ్ దంతాలు దెబ్బతినేలా చేస్తాయి.సో.రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగ‌కూడ‌ద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube