అధిక బరువు.ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, హార్మోన్ల లోపం, మద్యం అలవాటు ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరుగుతుంటారు.ఇక ఈ అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే.
గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే బరువు అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.
ఇక బరువు తగ్గేందుకు నిమ్మ రసం తీసుకోవడం చాలా మందికి ఉన్న అలవాటు.అయితే నిమ్మ రసంతో పాటుగా అవిసె గింజలు కలిపి తీసుకుంటే.మరింత త్వరగా బరువు తగ్గొచ్చు.అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి.
ముఖ్యంగా అవిసె గింజల్లో కేలరీలు తక్కువగా.ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
అలాగే ప్రొటీన్, ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉన్న అవిసె గింజలు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా బరువు తగ్గాలని భావించే వారు.అవిసె గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే కొద్దిగా నిమ్మ రసం కలుపుకుని సేవించాలి.ఇలా ప్రతి రోజు తాగడం వల్ల అధిక బరువు క్రమంగా తగ్గిపోతుంది.
ఈ డ్రింక్ సేవించడం వల్ల బరువు తగ్గడమే కాదు.మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
నిమ్మ రసంలో అవిసె గింజలు కలుపుకుని ప్రతి రోజు తీసుకోవడం వల్ల.అధిక రక్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.
ఫలితంగా గుండె జబ్బులకు కూడా దూరంగా ఉండొచ్చు.
ఇక మధుమేహం ఉన్న వారు రెగ్యులర్‌గా నిమ్మ రసంతో కలిపి అవిసె గింజలు తీసుకుంటే.
రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.అలాగే ఈ డ్రింక్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి.
ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు దూరం అవుతాయి.