ముఖ చర్మ రంగు అంతా ఒకేలా ఉండాలంటే నిమ్మ పేస్ పాక్స్  

మనం సాధారణంగా ముఖం కాంతివంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం.అలాగే ఖరీదైన కాస్మోటిక్స్ కూడా వాడుతూ ఉంటాం.అయినా పెద్దగా ఉపయోగం కనపడదు.అంతేకాక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.

అయితే ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే నిమ్మరసంతో కొన్ని ఫేస్ ఫాక్స్ వేసుకుంటే ముఖ చర్మం అంతా ఒకే రీతిలో ఒకే రంగులో ఉంటుంది.ఇప్పుడు ఆ ఫేస్ ఫాక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ముఖ చర్మ రంగు అంతా ఒకేలా ఉండాలంటే నిమ్మ పేస్ పాక్స్ lemon face masks for brighter clearer skin tone-తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. --

ఒక స్పూన్ కలబంద జ్యూస్ లో ఒక గుడ్డు తెల్లసొన,ఒక స్పూన్ నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి.

ఆ తరవాత ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి.

రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ నిమ్మరసం,చిటికెడు ఆరెంజ్ తొక్కల పొడి వేసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత లైట్ స్కిన్ టోనర్ రాస్తే మంచి ఫలితం కనపడుతుంది.

తాజా వార్తలు