భర్త స్నేహితునితో ఆ హీరోయిన్ వివాహేతర సంబంధం పెట్టుకుందా..?- Lekha Washington Alleged Affair With Husband Friend

lekha washington alleged affair with husband friend,lekha washington ,neizens, social media, imran khan, - Telugu Alleged Affair, Friend Husband, Imran Khan, Lekha Washington

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు లేఖా వాషింగ్టన్.వేదం సినిమాలో మంచు మనోజ్ స్నేహితురాలి పాత్రలో నటించిన లేఖ ఆ తరువాత కమినా, డైనమైట్ సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు.

 Lekha Washington Alleged Affair With Husband Friend-TeluguStop.com

గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న లేఖ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తితో వివాహేతర సంబంధం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో లేఖ పేరు బాగా వినిపిస్తోంది.

 Lekha Washington Alleged Affair With Husband Friend-భర్త స్నేహితునితో ఆ హీరోయిన్ వివాహేతర సంబంధం పెట్టుకుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తో లేఖ ప్రేమలో పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్ లకు చాలా సంవత్సరాల క్రితమే వేరువేరుగా వివాహాలు జరిగాయి.

వివాహం జరిగిన తరువాత లేఖ భర్త ఆమెకు ఇమ్రాన్ ఖాన్ ను పరిచయం చేశారు.

అయితే ఇమ్రాన్ ఖాన్ తో లేఖా వాషింగ్టన్ కు ఏర్పడిన పరిచయం ఆ తరువాత ప్రేమగా మారిందని వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని గత కొన్ని నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇమ్రాన్ ఖాన్ అతని భార్యకు విడాకులు ఇవ్వగా విడాకులకు కారణం కూడా లేఖ వాషింగ్టన్ అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.లేఖ వాషింగ్టన్ తీరుపై కొంతమంది తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
అయితే తనపై వ్యక్తమవుతున్న విమర్శల గురించి లేఖ వాషింగ్టన్ ఇప్పటివరకు స్పందించలేదు.ఇమ్రాన్ ఖాన్ విడాకులు ఇచ్చిన తరువాత అతనికి, లేఖ వాషింగ్టన్ కు మధ్య బంధం మరింత బలపడిందని వార్తలు వస్తున్నాయి.

అయితే లేఖ వాషింగ్టన్, ఇమ్రాన్ ఖాఅన్ నోరు మెదిపితే మాత్రమే జోరుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది.ఇమ్రాన్ ఖాన్ తీరుపై కూడా కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

#Alleged Affair #Imran Khan #Friend Husband

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు