బ్యాచిలర్ నుండి 'లెహరియా' సాంగ్ విడుదల..అఖిల్, పూజ కెమిస్ట్రీ సూపర్!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‘ సినిమా చేస్తున్నాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.

 Leharaayi Lyrical Song Released From Most Eligible Bachelor Movie, Leharaayi Lyr-TeluguStop.com

ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఈ సినిమాతో అయినా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

అఖిల్ కు ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.

నటన, డాన్స్ లో అదరగొడుతున్న ఎందుకో అఖిల్ కు కలిసిరావడం లేదు.ఈయన ఎంచుకునే స్టోరీలు వల్లే సినిమాలు ప్లాప్ అవుతున్నాయని అభిమానులు అనుకుంటున్నారు.

అయితే ఈసారి మాత్రం బ్యాచిలర్ బాబు ఫుల్ ఫోకస్ తో ఈ సినిమా చేసాడు.ఈ సినిమాలో పూజా తో రొమాన్స్ కూడా ఇరగదీశాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అంతేకాదు సినిమాపై అంచనాలను పెంచేసాయి.తాజాగా ఈ సినిమా నుండి మరొక సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్.లెహరియా లెహరియా.అంటూ సాగే లిరికల్ సాంగ్ ను మేకర్స్ ఈ రోజు విడుదల చేసారు.

ఈ సాంగ్ లో అఖిల్ పూజా కెమిస్ట్రీ అదిరి పోయిందనే చెప్పాలి.ఈ సాంగ్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ పాటకు మరో హైలెట్ గా నిలిచింది ఏంటంటే ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.

తన గాత్రంతో మరొకసారి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసారు.ఇక ఈ సినిమాను ఓటోబేర్ 8న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

మరి చూడాలి ఈ డేట్ కన్నా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో.

https://youtu.be/J1KpuR2Khz8

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube