మన శరీరానికి తిమ్మిర్లు రావడానికి గల కారణం ఏమిటంటే..?!

ఒకే చోట గంటల తరబడి నిల్చున్నా, కూర్చున్నా తిమ్మిర్లు పడతాయి.ఇది సాధారణ విషయమే కానీ కొందరికి తిమ్మిరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య అయ్యి వారిని జీవితాంతం బాధిస్తుంటుంది.

 Legs, Pain, Health Tips, Health Care, Health Benefits, Tips,salt Water-TeluguStop.com

తిమ్మిర్లు పట్టడం వల్ల ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టుగా ఉంటుంది.నడుస్తున్నప్పుడు భరించలేని మంట కలుగుతుంది.

జివ్వుమని లాగేసే ఈ తిమ్మిర్లను నిర్లక్ష్యం చేస్తే నరాల వ్యవస్థ శాశ్వతంగా నాశనమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటో వైద్యులు ఖచ్చితంగా ఇంకా కనుగొనలేదు.

 Legs, Pain, Health Tips, Health Care, Health Benefits, Tips,salt Water-మన -TeluguStop.com

కానీ తరచుగా ఈ సమస్య ఎదురైతే భవిష్యత్ లో విపరీతమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు ఘంటాపథంగా చెబుతున్నారు.

అయితే ఈ తిమ్మిర్లు రావడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయని వైద్యులు అనుమానిస్తున్నారు.

అవేంటంటే.రక్తప్రసరణ సక్రమంగా జరగకపోవడం, సుదీర్ఘకాలం తక్కువ ఉష్ణోగ్రతలలో జీవించడం, థైరాయిడ్ వ్యాధితో బాధపడటం, సక్రమంగా నీళ్లు తాగకపోవడం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడటం, దీర్ఘకాలంగా మానని గాయలతో ఉండటం, పొటాషియం, మెగ్నీషియం లోపించడం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యల కారణంగా తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంది.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు.రోజూ తీసుకునే ఆహారంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.కొబ్బరి నీళ్ల తోపాటు పోషకాలు అధికంగా లభించే విత్తనాలు, గింజలు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం స్థాయిలను పెంచుకోవచ్చు.అలాగే వ్యాయామం చేయడం తప్పనిసరి.

ప్రతి రోజు అరగంట పాటు నడిచినా కూడా తిమ్మిర్ల వ్యాధికి చెక్ పెట్టొచ్చు.డీహైడ్రేషన్ బారినపడకుండా ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల వాటర్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎప్సన్ ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా కూడా తిమ్మిర్లు రాకుండా నిరోధించవచ్చు.

Legs, Pain, Health Tips, Health Care, Health Benefits, Tips,salt Water - Telugu Benefits, Care, Tips, Legs, Pain

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube