మండలి రద్దుకు అసలు కారణం ఇదేనా ?

శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కేవలం కొన్ని బిల్లులు శాసనమండలిలో ఆమోదం పొందలేదనే కారణం చూపించి మండలిని ఇంత అకస్మాత్తుగా రద్దు చేయడం జగన్ అహంకారానికి నిదర్శనం అంటూ టిడిపి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది.

 Legislative Council Chandrababu Naidu Ysjagan Three Capitals-TeluguStop.com

అయినా ఈ విషయాన్ని జగన్ కానీ, ఆ పార్టీకి చెందిన వారు కానీ ఎవరూ పట్టించుకునేందుకు సిద్ధంగా లేరు.ఈ పరిస్థితుల్లో జగన్ ఇంత అకస్మాత్తుగా మండలిని రద్దు చేసేలా అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించడం వెనుక కారణాలు ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే ఏపీలో ఘోరంగా ఓటమి చెందిన టిడిపి తన ఉనికిని చాటుకునేందుకు ఇలా శాసనమండలిలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డం పడుతోంది.

తమపై పైచేయి సాధించే విధంగా ఎత్తుగడలు వేయడం, అదే సమయంలో టిడిపి భావి వారసుడిగా భావిస్తున్న లోకేష్ ను ప్రమోట్ చేసుకునేందుకు శాసనమండలిని వేదికగా ఉపయోగించుకోవడం తదితర కారణాల వల్ల జగన్ చాలాకాలంగా ఆగ్రహంగా ఉన్నారు.

ఇక మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానంలో లోకేష్ ఘోర ఓటమి చెందారు.

అయినా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉండడంతో తనకు తిరుగు లేకుండా చేసుకుంటూ మండలిలో అధికార పార్టీపై విమర్శలు చేస్తూ రాజకీయ నడిపిస్తున్నారు.ఇదే జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్న టు తెలుస్తోంది.

మూడు రాజధానులపై కీలక బిల్లులను ప్రవేశపెట్టినా మండలిలో మెజార్టీ ఉన్న కారణంగా టిడిపి అడ్డుకుంది.ఈ విషయం ముందుగానే తెలిసిన జగన్ కావాలని మనీ బిల్లు రూపంలో కాకుండా సాధారణ బిల్లుగా దీనిని ప్రవేశపెట్టారు.

మండలిని రద్దు చేసేందుకు ఏదో ఒక విషయం కావాలి కాబట్టి దీనిని ఇలా ఉపయోగించుకుని ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

Telugu Chandrababu, Councils, Ysjagan-Telugu Political News

మండలిని రద్దు చేయడం ద్వారా లోకేష్ తో పాటు కొంతమంది సీనియర్ టిడిపి నాయకుల గొంతు పైకి రాకుండా చేయాలని జగన్ ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది.ఎమ్మెల్సీ పదవిని అడ్డంపెట్టుకుని లోకేష్ చేస్తున్న హడావుడికి అడ్డుకట్ట వేయాలంటే ఎమ్మెల్సీ పదవిని ఊడగొట్టాలని వైసీపీ ప్లాన్.ఆయనతో పాటు టిడిపి సీనియర్లు చాలామంది పదవులను ఊడగొట్టి ఇంట్లో కూర్చో పెట్టాలంటే మండలి రద్దు చేయడం ఒక్కటే మార్గం అని జగన్ భావించారు.

దీంతో పాటు తమకు శాసనసభలో మెజారిటీ ఉన్నా, మండలిలో అడుగడుగున టిడిపి అడ్డం పడడం తదితర కారణాలు జగన్ ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube