సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తున్న బాలయ్య హీరోయిన్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “లెజెండ్” చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన నటించి ప్రేక్షకులను అలరించిన “ముంబై బ్యూటీ సోనాల్ చౌహన్” గురించి తెలియని వారుండరు. అయితే ఈ అమ్మడు మొదటగా “రేయింబో” అనే చిన్న బడ్జెట్ తరహా చిత్రంలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రం పెద్దగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

 Legend Movie Fame Sonal Chauhan Raising Heat With Bikini, Legend Movie, Sonal Ch-TeluguStop.com

ఆ తరువాత తెలిసిన వారి ద్వారా లెజెండ్ చిత్ర ఆడిషన్స్ కి అటెండ్ అయ్యి బాలయ్య బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.ఈ మధ్యకాలంలో సోనాల్ చౌహాన్ సినిమాల పరంగా కొంత మేర జోరు తగ్గించినట్లు తెలుస్తోంది.

దీనికితోడు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు దాదాపుగా ఎక్కువ శాతం బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు కరువైనట్లు కొందరు చర్చించుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో సోనాల్ చౌహన్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఇందులో భాగంగా తన అందమైన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేస్తోంది.

 అయితే తాజాగా బీచ్ లో బికినీ దుస్తులు ధరించి ఫోజులిచ్చింది.అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో కూడా షేర్ చేసింది.

 దీంతో ఈ అమ్మడు అందాలకు ఫిదా అయిన నెటిజన్లు బీచ్ లో సోనాల్ చౌహాన్ సెగలు పుట్టిస్తుందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అంతేగాక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా పది లక్షల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.

దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సోనాల్ చౌహాన్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అని.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక  33 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సోనాల్ చౌహాన్ ఆ మధ్య తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించిన “రూలర్” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించింది.తను ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు.అయితే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సోనాల్ చౌహాన్ లు హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube