ఎన్టీఆర్‌ మూవీకి లీగల్‌ చిక్కులు       2018-06-28   05:51:00  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘ఎన్టీఆర్‌’ పట్టాలెక్కకుండానే అప్పుడే వివాదంలో చిక్కుకుంది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ నటిస్తూనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుందని భావిస్తున్న సమయంలోనే ఈ చిత్రం హీరో బాలకృష్ణకు, దర్శకుడు క్రిష్‌కు నాదెండ్ల భాస్కర్‌ రావు తనయుడు లీగల్‌ నోటీసులు పంపించడం జరిగింది. అప్పట్లో జరిగిన విషయాలను తప్పుగా చూపించి తన తండ్రిని బ్యాడ్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఆయన ఆరోపిస్తున్నాడు.

ఎన్టీఆర్‌ నుండి నాదెండ్ల భాస్కర్‌ రావు అధికారంను లాగేసుకున్నాడు అంటూ ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చూపించేందుకు దర్శకుడు క్రిష్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు అంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఆయన లీగల్‌ నోటీసులు పంపించారు. తన తండ్రి గురించి తప్పుగా చూపించినట్లయితే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. సినిమా ప్రారంభంకు ముందే తమకు స్క్రిప్ట్‌ అంతా చూపించాల్సిందే అని, అలాగే సినిమా విడుదల సమయంలో కూడా ముందే తమకు చూపించాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.

తన తండ్రి గురించి ఒక్క సీన్‌ తప్పుగా కూడా కూడా లీగల్‌గా చర్యలు తీసుకుంటాను అంటూ ఆయన హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చిత్ర యూనిట్‌ సభ్యులు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ మరియు క్రిష్‌లు ప్రస్తుతం ఈ విషయమై ఆలోచనల్లో పడ్డారు. లీగల్‌ సమస్యలు ఎదుర్కొనేందుకు సిద్దం అయితే ఆ సీన్స్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పుడు లేని పోని ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకు అనుకుంటే ఖచ్చితంగా ఆ సీన్స్‌ లేకుండానే సినిమాను తీసే అవకాశం ఉంది.

సినిమా తీసిన తర్వాత లీగల్‌ నోటీసులు పంపితే అప్పుడు షూటింగ్‌ అయిపోయిందని కోర్టుకు చెప్పేవారు. కాని ముందే లీగల్‌ నోటీసులు వెళ్లాయి కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఎన్టీఆర్‌ చిత్రం స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సిందే అంటూ కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకు ముందే ఇలాంటి అవరోదాలను ఎదుర్కోవడం చర్చనీయాంశం అవుతుంది. మొదట దర్శకుడు మారడం, ఆ తర్వాత ఇలా జరగడంతో బాలకృష్ణ ఫ్యాన్స్‌ నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.