సల్మాన్ కుటుంబం పై ఆరోపణలు చేసిన డైరెక్టర్,కోర్టుకు వెళతామంటున్న అర్బాజ్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య ఘటన యావత్ దేశాన్ని కలవరపరచిన విషయం తెలిసిందే.ఆయన మృతికి బాలీవుడ్ లోని కొందరి పెద్దల వేధింపులే కారణం అంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ కూడా ఆ ఆరోపణలను సమర్ధిస్తూ తాను కూడా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోవడానికి సల్మాన్,ఆయన కుటుంబ సభ్యుల వేధింపులే కారణం అంటూ ఆరోపణలు చేసారు.2013 లో నా “బేషరమ్” మూవీ విడుదలకు సల్మాన్ కుటుంబమే అడ్డుపడింది అని,నన్ను వేధించడమే కాకుండా నా భార్యపై అత్యాచారం చేస్తాం అంటూ బెదిరించారు అని ఆయన ఆరోపిస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.2010 లో సల్మాన్, అర్బాజ్ ఇద్దరూ నటించిన ‘దబాంగ్’ చిత్రానికి అభినవ్ దర్శకత్వం వహించగా,ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే.అయితే దబాంగ్-2 ప్రాజెక్టు కూడా అభినవ్ తోనే ప్లాన్ చేయగా, సడన్ గా ఆయన తప్పుకోవడంతో ఆ చిత్రానికి అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు.

 We Are Taking Legal Action On Abhinav Kashyap Says Arbaaz Khan,abhinav Kashyap ,-TeluguStop.com

అయితే అప్పటి నుంచి కూడా ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ అతడితో అసలు కాంటాక్ట్ లోనే లేదని అసలు అభినవ్ చేస్తున్న ఆరోపణలు ఎక్కడినుంచి వస్తున్నాయో తనకు తెలియదని అర్బాజ్ అంటున్నారు.గతంలో కూడా ఆయనపై లీగల్ చర్య తీసుకున్నానని ఆయన చెప్పారు.

దబాంగ్-2 ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆయనతో తాము కాంటాక్ట్ లో లేమని, ప్రొఫెషనల్ గా తాము విడిపోయామని అర్బాజ్ ఖాన్ స్పష్టం చేశారు.అటు-సలీం ఖాన్ కూడా అభినవ్ కశ్యప్ ఆరోపణలపై స్పందిస్తూ.

ఆయన వ్యాఖ్యలను పట్టించుకోనని, ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

వాటికి స్పందించి తన సమయాన్ని వృధా చేసుకోనన్నారు.

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనను తన ఫేస్ బుక్ లో ప్రస్తావించిన అభినవ్ కశ్యప్.దీనిపై కూలంకషంగా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూనే.

సల్మాన్ కుటుంబం నుంచి తాను వేధింపులను ఎదుర్కొన్నాను అంటూ ఆరోపణలు చేశారు.అయితే కశ్యప్ ఆరోపణలపై అర్బాజ్ ఖాన్ స్పందిస్తూ అతడి ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని దీనిపై కోర్టు కు వెళ్తాను అంటూ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube