బీజేపీ ని గద్దె దించడమే వామపక్షాల లక్ష్యం అంటున్న నేత..!!

తెలంగాణ రాష్ట్రంలో మూడవ రాష్ట్ర వామపక్షాల సమావేశంలో సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.దేశంలో వామపక్షాల ఐక్యత దెబ్బతినటంతో బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని రామ పక్షాల నేతలు పేర్కొన్నారు.

 Left Party Leaders Serious Comments On Bjp Cpi,  Cpm,  Bjp,  Poltics , Sitaram A-TeluguStop.com

దేశంలో ప్రజాస్వామ్యం అదేరీతిలో మతసామరస్యం దెబ్బతీసే రీతిలో అధికార పార్టీ కుయుక్తులను ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమాలు బలపరచడం సరైన మార్గమని వామపక్షాలు పేర్కొన్నాయి.తెలంగాణలో బీజేపీ ని వ్యతిరేకిస్తూనే అధికార పార్టీ టిఆర్ఎస్ తో కలిసి పని చేస్తానికి రేడిగా ఉన్నామని తెలంగాణ సిపిఎం పార్టీల నేతలు తెలియజేశారు.

తెలంగాణ మూడవ రాష్ట్ర సిపిఎం మహాసభల సందర్భంగా… రాజకీయ తీర్మానంపై చర్చ జరిగింది.

బీజేపీ అధికారంలో ఉంటే ఆర్ఎస్ఎస్ విధానాలనే అమలు చేస్తారని సిపిఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి తెలియజేశారు.

రైతుల పోరాటం మోడీ సర్కార్ నీ లొంగదీసింది అని తెలియజేశారు.సిపిఎం రాష్ట్ర మహాసభలకు సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు చాడ వెంకట్ రెడ్డి కూడా హాజరయ్యారు.

వామపక్ష పార్టీలు బలహీనపడ్డాయి అందువల్లే దేశంలో అరాచకం పెరిగిందని చాడ వెంకట్రెడ్డి ఈ సమావేశంలో స్పష్టం చేశారు.మామ పక్షుల ఐక్యత మరియు పునరేకీకరణ కూడా జరగాలని స్పష్టం చేశారు.భావసారూప్యత కలిగిన పార్టీలు వామపక్ష పార్టీలు అని స్పష్టం చేశారు.దేశంలో బీజేపీ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదు వామపక్ష పార్టీలు అని ఈ సమావేశంలో నేతలు తెలియజేశారు.

జాతీయస్థాయిలో సిపిఐ సిపిఎం నాయకులు కలిసి పని చేసేలా వ్యవహరించాలని ఈ సమావేశంలో నేతలు కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube