వీధి రౌడీల్లా మారిన ఉపాధ్యాయులు.. తరగతి గదిలోనే.. ?

క్లాస్ రూం అంటే దేవాలయ ప్రాంగణంతో సమానం అంటారు.ఇక పాఠాలు చెప్పే గురువులను దైవంతో సమానంగా భావిస్తారు.

 Lecturers Beaten In The Classroom-TeluguStop.com

మరి ఈ మధ్యకాలంలో ఇలాంటి గురువులు పెడతోవ పడుతూ, సమాజానికి ఆదర్శంగా ఉండవలసింది పోయి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే విద్యార్ధినిలపై అధ్యాపకుల అత్యాచారాలు అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మరొక అడుగు ముందుకేసిన లెక్చరర్లు క్లాస్‌రూమ్‌లోనే కొట్టుకున్న సంఘటన తూర్పుగోదావరిజిల్లాలో చోటుచేసుకుంది.

ఆ వివరాలు చూస్తే.

 Lecturers Beaten In The Classroom-వీధి రౌడీల్లా మారిన ఉపాధ్యాయులు.. తరగతి గదిలోనే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనపర్తి శివారు కొత్తూరులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఇంగ్లీష్ మీడియం గురుకుల జూనియర్‌ కాలేజీలో వెంకటేశ్వరరావు అనే లెక్చరర్‌ పార్ట్ టైంలో ఇక్కడ పాఠాలు బోధిస్తున్నాడట.

కాగా ఈ స్కూల్ ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు కొంతకాలం క్రితం వెంకటేశ్వరరావుతో పాటు కొంత మంది పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు టెట్‌ పరీక్షలకు హాజరుకాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు ఈ లెక్చర్ల పై విచారణ జరిపించారట.

ఈ విషయంలో రగిలిపోతున్న ఇతను శ్రీనివాసరావు తో విభేదాలను పెంచుకుని కాలేజీలో జరుగుతున్న విషయాలు ఉన్నతాధికారులకు చెప్పడంతో, వారు శ్రీనివాసరావును వివరణ కోరారట.

దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్రస్దాయికి చేరుకోగా గురువారం ఇద్దరు క్లాస్‌రూమ్‌లోనే ఘర్షణకు దిగి, వీధి రౌడిల్లా ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారట.

ఇక తీవ్రంగా గాయపడిన వీరిని తోటి అధ్యాపకులు విడదీసి, అనపర్తి ఆస్పత్రికి తరలించారట.

కాగా లెక్చరర్లు ఇలా క్లాస్‌రూమ్‌లోనే కొట్టుకోవడం చూస్తుంటే నేటి విద్యా వ్యవస్ద తీరుకు సమాజం సిగ్గుపడవలసిన పరిస్దితులు ఉన్నాయంటున్నారట.

#East Godavari #Class Room #Anaparthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు