బాలయ్యను చూసి నేర్చుకోండి.. యంగ్ హీరోస్ కు నెటిజన్లు సూచన..

Learn From Hero Balakrishna Netizens Trolled Star Heros

అఖండ సినిమా మేనియాతో సోషల్ మీడియా హల్ చల్ అవుతోంది.చాలా రోజుల తర్వాత బాలయ్య అభిమానులు థియేటర్ల ముందు సందడి చేస్తున్నారు.

 Learn From Hero Balakrishna Netizens Trolled Star Heros-TeluguStop.com

కటౌట్లు.మంగళ హారతులతో సంబురాలు చేసుకుంటున్నారు.

అనుకున్నట్లుగానే అఖండ.అఖండ విజయం సాధించింది.

 Learn From Hero Balakrishna Netizens Trolled Star Heros-బాలయ్యను చూసి నేర్చుకోండి.. యంగ్ హీరోస్ కు నెటిజన్లు సూచన..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బాలయ్య చాలా రోజుల తర్వాత అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో తన నటన పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బాలయ్య నిజానికి చాలా కమిటెడ్ హీరో.తన శక్తి వంచన లేకుండా తను చేసే సినిమా కోసం కష్టపడతాడు.బయట ఆయన ఎలా ఉన్నా.సినిమా విషయంలో మాత్రం వందకు వంద శాతం కష్టపడి పనిచేస్తాడు.

యాక్షన్ సన్నివేశాలతో సహా అన్ని సీన్ల విషయంలో ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు.భారీ సినిమాల విషయంలో ఆయన ఎన్నో సార్లు ప్రమాదానికి గురయ్యాడు.

అయినా సరే.ఎక్కడా వెనక్కి తగ్గలేదు.తాజాగా అఖండ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు.60 ఏండ్ల వయసులో యంగ్ హీరోలకు సాధ్యంకాని రీతిలో నటనను ప్రదర్శించాడు.యాక్షన్ సీన్స్ తో పాటు పాటలకు అద్భుతమైన స్టెప్పులు వేసి వారెవ్వా అనిపించాడు.బాలయ్య ను చూసి నేర్చుకుంటే యంగ్ హీరోలు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది.

Telugu Akhanda, Bala Krishna, Balakrishna, Balayya, Hard, Tollywood, Young Heroes-Movie

నిజానికి చాలా మంది సినీ జనాల మాట ఒక్కటే.బాలయ్యను చూసి సినిమా కోసం ఎలా కష్టపడాలో నేర్చుకోవచ్చు.డిమాండ్ ఉన్నంత మాత్రాన భారీగా రెమ్యునరేషన్ అడుగుతూ ఇబ్బందులు పెట్టడు బాలయ్య.తన స్థాయికి మించి పారితోషకం ఏనాడూ అడగలేదంటారు నిర్మాతలు.షూటింగ్ కు చెప్పిన టైంకు రాని హీరోలు బోలెడు మంది ఉన్నారు.కానీ బాలయ్య టైం అంటే టైమే.

ఎన్ని గంటలకు రావాలంటే.అంతకు 10 నిమిషాల ముందే ఉంటాడు.

అంతేకాదు.సినిమా విషయంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు.

అందుకే బాలయ్య అంటే చాలా మంది నిర్మాతలు, దర్శకుకు అమితమైన ఇష్టం అంటారు.

#Young Heroes #Akhanda #Hard #Balakrishna #Balayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube