గూగుల్ మ్యాప్స్, సెర్చ్‌లో వచ్చిన అప్డేటెడ్ ఫీచర్లు గురించి తెలుసుకోండి!

టెక్ దిగ్గజం గూగుల్ తన మ్యాప్స్, సెర్చ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఎన్నో ఫీచర్లను పరిచయం చేయగా తాజాగా మరిన్ని ఫీచర్లను జోడిస్తోంది.ఎయిర్ క్వాలిటీ, స్ట్రీట్ వ్యూ, 3D వ్యూ, ట్రాఫిక్ లెవెల్ వంటి ఎన్నో వివరాలను ఇపుడు గూగుల్ చిటికెలో అందిస్తోంది.

 Learn About The Updated Features In Google Maps , Search, Google Maps, Google Se-TeluguStop.com

ఒక ప్లేస్‌కి వెళ్లగానే అక్కడ ఉన్న రెస్టారెంట్స్‌ రివ్యూ కూడా ఇది చెప్పేస్తోంది.అయితే మ్యాప్స్ ద్వారా యూజర్లకు మరింత డిటైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేయడానికి గూగుల్ ప్లాన్ చేస్తోంది.

అలానే మ్యాప్స్‌తో పాటు సెర్చ్‌లో కూడా అదిరిపోయే ఫీచర్స్‌తీసుకొస్తోంది.

 Learn About The Updated Features In Google Maps , Search, Google Maps, Google Se-TeluguStop.com

తాజాగా ఇప్పుడు గూగుల్ ‘వైబ్ చెక్’, ‘విజువల్ ఫార్వర్డ్’, ఇమ్మర్సివ్ వ్యూ అనే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు తీసుకొస్తున్నట్లు తన తాజా ఈవెంట్‌లో చెప్పుకొచ్చింది.

కొన్ని నెలల క్రితం ఇమ్మర్సివ్ వ్యూ అనే అద్భుతమైన ఫీచర్‌ను గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు.అదే ఫీచర్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు బుధవారం నాడు సెర్చ్ ఆన్ ఈవెంట్‌లో గూగుల్ తెలిపింది.

అలాగే తన సెర్చ్, మ్యాప్స్‌లో తీసుకొచ్చే ఫీచర్లను ప్రకటించింది.గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ‘Immersive View’ ఫీచర్ యూజర్లకు సెర్చ్ చేసిన ప్రాంతానికి సంబంధించి 3D డ్రోన్ వ్యూ ఆఫర్ చేస్తుంది.

వైబ్ చెక్ లేదా ‘నైబర్‌హుడ్ వైబ్’ అనే కొత్త ఫీచర్ యూజర్లు తమ పరిసరాల్లోని ఆసక్తికర ప్రదేశాలను అర్థం చేసుకోవడానికి, కనుగొనడానికి సహాయ పడుతుంది.గూగుల్ తన సెర్చ్ ఇంజన్‌లో ‘విజువల్ ఫార్వర్డ్’ ఫీచర్‌ను కూడా విడుదల చేస్తోంది.దీని సహాయంతో యూజర్లు ట్రావెల్ డెస్టినేషన్స్‌, హాలిడే స్పాట్‌లకు సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలు కూడా చూడవచ్చు.ఈ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లోని ఫోటో స్టోరీల మాదిరిగానే కనిపిస్తాయి.

ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఏదైనా డెస్టినేషన్ కోసం సెర్చ్ చేస్తే.బ్రౌజర్ వారికి సంబంధిత లింక్స్‌, ట్రావెల్ సైట్స్‌, ఫొటోలతో గైడ్స్‌ను షో చేస్తుంది.

Video : Learn About The Updated Features In Google Maps , Search, Google Maps, Google Search, New Features, New Updates, Technology News, #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube