నేత్రదానం చేసిన అందాల భామ! అందరూ చేయాలని సందేశం  

Leading Telugu Actress Donates Her Eyes - Telugu, Raashi Khanna, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోయిన్ గా మారిన అందాల భామ రాశీఖన్నా.టాలీవుడ్ యువ హీరోలందరితో ఇంచు మించు ఆడిపాడిన ఈ భామ చివరిగా వెంకీ మామా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

 Leading Telugu Actress Donates Her Eyes

ఇక మన తెలుగు భామలకి తమ నటన, గ్లామర్ తో మైమరపించడంతో పాటు అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలతో తమ గొప్ప మనసు చూపిస్తూ ఉంటారు.సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలలో పాల్గొని తన వాయిస్ వినిపిస్తూ ఉంటారు.

ఇప్పుడు ఈ వరుసలో రాశీ ఖన్నా కూడా వచ్చి చేరింది.ఆమె కూడా ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో భాగం అవుతూ ఉంటుంది.

నేత్రదానం చేసిన అందాల భామ అందరూ చేయాలని సందేశం-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఈ భామ ఓ ప్రైవేట్ కంటి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది.కమర్షియల్ లో ఈ పని తనకి గిట్టుబాటయ్యేదే కాని అక్కడ ఈ అమ్మడు మరో మంచి పని చేసింది.

నేత్రదానం ప్రాధాన్యత అందరికి తెలియజేసే విధంగా తాను కూడా కూడా నేత్రదానం చేయడానికి ముందుకొచ్చింది.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.నేను నా కళ్ళు దానం చేశాను? మరి మీరు కూడా చేసారా అంటూ అవగాహనా పెంచే విధంగా పోస్ట్ పెట్టింది.దీనిపై నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తూ కామెంట్స్ పెట్టారు.

మీలాంటి వారు ఇలా ముందుకొచ్చి నేత్రదానంపై అవగాహనా పెంచితే చాలా మంది ప్రజలు కూడా నేత్రదానం చేయడానికి ముందుకొస్తారు అంటూ కామెంట్లు పెట్టారు.అయితే కొందరు ఆమె పోస్ట్ తో పాటు షేర్ చేసిన ఫోటోపై కాస్తా నెగిటివ్ కామెంట్స్ చేశారు.

వారికి తనదైన శైలిలో రియాక్షన్ ఇచ్చింది.మొత్తానికి రాశీ ఖన్నా చేసిన ఈ పనిని మిగిలిన సెలబ్రిటీలు కూడా ఫాలో అయితే బాగుంటుంది అనే అభిప్రాయం వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Leading Telugu Actress Donates Her Eyes Related Telugu News,Photos/Pics,Images..

footer-test