ఫుడ్ లవర్స్‌కు ప్రముఖ డెలివరీ సంస్థ సూపర్ ఆఫర్.. పరిమితులకు మించి..!

కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్ని సంస్థలు ఆర్థికంగా నష్టపోగా, కొంత మేర నిలదొక్కుకున్నది ఫుడ్ డెలివరీ ఆర్గనైజేషన్స్ అని చెప్పొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు అన్ని క్లోజ్ కాగా, జనాలు ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు.

 Leading Delivery Company Super Offer For Food Lovers Beyond Limits-TeluguStop.com

ఈ క్రమంలో ఆర్డర్స్ బాగా పెరిగి సంస్థలకు లాభాలు వచ్చాయి.అయితే, తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో యూజర్స్ కోసం న్యూ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

అదేంటో తెలుసుకోవాలని మీకు ఉందా? అయితే, మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

 Leading Delivery Company Super Offer For Food Lovers Beyond Limits-ఫుడ్ లవర్స్‌కు ప్రముఖ డెలివరీ సంస్థ సూపర్ ఆఫర్.. పరిమితులకు మించి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Beyond Limits Jomato, Food Offer, Jomato, New Member Ship, Super Offer For Food Lovers-Latest News - Telugu

యూజర్స్ కోసం జొమాటో సంస్థ జొమాటో ప్రో ప్లస్‌ పేరిట కొత్త మెంబర్‌షిప్‌ను ప్రకటించింది.ఈ మెంబర్‌షిప్‌లో భాగంగా అపరిమిత ఫ్రీ డెలివరీలను కస్టమర్స్‌కు ఫుడ్ డెలివరీ సంస్థ అందించనుంది.ఈ విషయాన్ని జొమాటో కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు.

అయితే, ఈ ఆఫర్ అందరికీ అవెయిలబుల్‌లో ఉండే చాన్సెస్ తక్కువే.ఆగస్టు 2 సాయంత్రం ఆరు గంటల లోపు జొమాటో యాప్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చిన వారు మాత్రమే ఈ ఆఫర్‌కు ఎలిజిబుల్ పర్సన్స్.

ఇన్విటేషన్ వచ్చిన సదరు వ్యక్తులు పేర్కొన్న అమౌంట్‌ను చెల్లించి ప్రో ప్లస్ మెంబర్ షిప్ సేవలు పొందొచ్చు.అయితే, ప్రో ప్లస్‌ మెంబర్‌షిప్‌ ధరలను ఇంకా సంస్థ ప్రకటించలేదు.

కొవిడ్ మహమ్మారి పుణ్యమాని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల దశ, దిశ మారిందనే చెప్పొచ్చు.ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు జనాలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

తమకు నచ్చిన రెసిపీస్ లేదా ఫుడ్ ఐటమ్స్‌ను వెరీ ఫాస్ట్‌గా ఆర్డర్ చేసుకుంటున్నారు.అయితే, కొవిడ్ వల్ల ఆహారం అందక చాలా మంది సతమతమైన ఘటనలను మనం చూడొచ్చు.

కాగా, ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో కొవిడ్ టైంలో జనాలకు సాయం చేయడంతో పాటు లాభం కూడా పొందింది.neqw

.

#Limits Jomato #JOMATO #Member Ship #Super Lovers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు