మెల్లమెల్లగా టీఆర్ఎస్ నుండి జారుతున్న నేతలు.. అసలు కారణం ఇదేనా?

ప్రస్తుతం చాలా వరకు తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్య పెద్ద ఎత్తున రకరకాల అంశాలపై మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.తెలంగాణలో అధికార పక్షానికి పోటీగా బలమైన ప్రతిపక్షం అనేది లేని పరిస్థితి ఉంది.

 Leaders Slowly Falling From Trs .. Is This The Real Reason Trs Party, Telangana-TeluguStop.com

అయితే బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని బలమైన ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీజేపీ మరింత దూకుడుతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ క్రమంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది.టీఆర్ఎస్ లో ఉండి అసంతృప్తిగా ఉన్న నేతలపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టి తమ పార్టీలో చేరాలని కోరుతున్న పరిస్థితి ఉంది.

అయితే వచ్చిన వారు టీఆర్ఎస్ పై అదే విధంగా కేసీఆర్ పై కూడా పెద్ద ఎత్తున ఘాటు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే ఎమ్మెల్సీలో అవకాశం కొరకు వేచి చూసి అవకాశం దక్కని నేతలందరు బీజేపీ బాట పడుతున్నారు.

రాజకీయాల్లో పరిస్థితులను బట్టి కొందరికి తొందరగా అవకాశాలు వస్తుంటాయి.కొందరికి తొందరగా అవకాశాలు రాని  పరిస్థితి ఉంటుంది.

రాజకీయాలలో ఇది చాలా సహజం.కానీ బీజేపీ మాత్రం ఈ చేరికల విషయాన్ని కూడా రాజకీయ లబ్ధి కొరకు  మరింతగా ఘాటు విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది.

Telugu @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Bjp, Etala, Telan

టీఆర్ఎస్ నుండి వెళ్తున్న అసంతృప్తి నేతలను కేసీఆర్ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయకపోవడం ఒక కీలక పరిణామం.అయితే వెళ్తున్న వారిపై ముందుగానే కేసీఆర్ కు ఖచ్చితమైన సమాచారం ఉండడంతోనే వెళ్ళినా పార్టీకి నష్టం లేదని భావించిన కారణంగానే ఎవరిని బుజ్జగించే ప్రయత్నం చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube