మల్లన్న ... విఠల్ ! అబ్బో బీజేపీ లో సందడి మామూలుగా లేదు 

తెలంగాణ బిజెపి లో సందడి వాతావరణం నెలకొంది . టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో నెలకొనడం బిజెపికి ఎక్కడలేని సంతోషాన్ని కలిగిస్తోంది.

 Telangana, Teenmar Mallanna, Trs, Hujurabad, Bjp Operation Akarsh, Bandi Sanjay,-TeluguStop.com

దీనికితోడు ఇటీవల బిజెపి బలం పుంజుకోవడం,  అలాగే దుబ్బాక , హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, ఇవన్నీ బీజేపీకి బాగా కలిసి వస్తున్నాయి.దీనికితోడు అధికార పార్టీ టిఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

గతంతో పోలిస్తే ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపై బాగా పెరిగింది.నాయకులలోను కెసిఆర్ తీరుపై అసంతృప్తి పెరగడం ఇవన్నీ బిజెపికి బాగా కలిసి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే వలసలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.కేంద్ర బిజెపి పెద్దల ప్రోత్సాహంతో పెద్ద ఎత్తున తెలంగాణలో కీలకమైన నాయకులందరినీ బిజెపిలో చేర్చుకుని మరింత బలోపేతం అవ్వాలని నిర్ణయించుకుంది.

దీనిలో భాగంగానే గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది.ఇది ఎలా ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్న నాయకులు ఇప్పుడు బిజెపిలోకి క్యూ కడుతున్నారు.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి ముఖ్యమంత్రి కే ముచ్చెమటలు పట్టించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.  ఈ మేరకు బిజెపి నేతలతో ను ఆయన సమావేశమయ్యారు.

రేపు ఆయన బిజెపి లో చేరబోతున్నారు.

Telugu Bandi Sanjay, Bjp Akarsh, Hujurabad, Telangana, Telangana Cm-Telugu Polit

ఆయనే కాకుండా తెలంగాణలో నీళ్లు , నిధులు , నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఉద్యమ సమయంలో పెద్ద ఆందోళనలు నిర్వహించిన ఉద్యోగ సంఘాల నాయకుడు విఠల్ కూడా బిజెపిలో చేరబోతున్నారు.విఠల్ కు తెలంగాణలో మంచి గుర్తింపు ఉంది.ఉద్యమ కార్యక్రమాలు వ్యూహకర్తగా, సమర్థుడుగా పేరుప్రఖ్యాతులు ఆయనకు ఉన్నాయి.

ఆయన తో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్న మరి కొంతమంది కీలక నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తుండడం తో బీజేపీ లో జోష్ పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube