ఎన్నికల ప్రచారంలో దొంగల చేతివాటం! దొరికింది దొరికినట్లు దోచుకోవడమే

ఎన్నికల తర్వాత రాజకీయ నాయకలు ఎలాగూ అందరిని దోచుకోవడం మొదలెడతారు.మరి ఎన్నికల ప్రచారంలో వారిని దోచుకుంటే తప్పేంటి అని అనుకున్నారో ఏమో కాని దొంగలు చేతివాటం చూపించడం మొదలెట్టారు.

 Leaders Facing Theft Problem In Election Campaign-TeluguStop.com

రద్దీగా ఉండే ప్రాంతాలని టార్గెట్ గా చేసుకొని అక్కడికి వచ్చే జనాల పార్స్ లు, ఉంగరాలు, డబ్బు దోచేసే దొంగలు ఇప్పుడు ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని కూడా మంచి అవకాశంగా వాడుకుంటున్నారు.ఎన్నికల ప్రచార ర్యాలీలలో ఎలాగూ ఎక్కువ సంఖ్యలో జనం వస్తూ ఉంటారు.

వాళ్ళని టార్గెట్ చేస్తే కావాల్సినంత దోచుకోవచ్చు అని డిసైడ్ అయ్యి దొంగల తమ వేట మొదలెట్టారు.

అయితే ఈ సారి దొంగలు తమ చేతివాటంకి మరింత పదును పెట్టి నాయకులని కూడా టార్గెట్ చేయడం విశేషం.

నాయకులు ఎక్కువగా ప్రచార కార్యక్రమాలలో అభిమానులు, కార్యకర్తలతో కరచాలనం చేస్తూ ఉంటారు.ఇదే అవకాశంగా భావించి వారి చేతి ఉన్గారాలు లేపెస్తున్నారు.తాజాగా వైసీపీ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జగన్ సోదరి షర్మిల చేతి ఉంగరం ఎవరో బలవంతంగా లాగేశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

కరచాలనం ఇచ్చినట్లు ఇచ్చి ఉంగరం లేపెసారు.

అలాగే కొద్ది రోజుల క్రితం ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మేడలో చైన్, చేతి ఉంగరం ఎవరో నోక్కేసారు.మీడియా సమావేశంలో కూడా పాల్ తన చైన్ పోయింది అని గగ్గోలు పెట్టాడు.ఇక దొంగల చేతివాటంకి, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అభిమానులు, కార్యకర్తలు విపరీతంగా బలైపోతున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube